Golden King Cobra Video Watch Here: ప్రపంచంలో ఎన్నో రకాల అరుదైన పాములు ఉన్నాయి ఈ పాములన్ని వింత వింత ఆకారం వింత వింత రంగుల్లో మనం తరచుగా వీడియోలో చూస్తూ ఉంటాం.. నిజానికి కొన్ని పాములు ఎరుపు రంగులో ఉంటే మరికొన్ని పాములు తెలుపు రంగులో ఉంటాయి. ఇక ఇంకొన్ని పాములు మాత్రం చాలా అరుదైన గోల్డెన్ కలర్ లో ఉంటాయి. ప్రపంచంలో ఇలాంటి పాములు చాలా అరదుగా జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భూమిపై కొన్ని గోల్డెన్ కింగ్ కోబ్రాలు ఉన్నప్పటికీ.. ఇవి అరదుగా వాటి నివాసాల నుంచి బయటికి వస్తాయి. గతంలో ఇలాంటి పాములకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా గోల్డెన్ కింగ్ కోబ్రాకు సంబంధించిన కొన్ని వీడియోలు అయితే.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం మీరు చూసి ఉంటారు. అయితే ఇటీవల కూడా గోల్డెన్ కింగ్ కోబ్రా కు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఆ బంగారు రంగులో నాగుపాము ఏం చేస్తుందో.. వీడియో వైరల్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నిజానికి సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే పాముల్లో గోల్డెన్ కింగ్ కోబ్రా ఒకటి. ఈ కింగ్ కోబ్రా చాలా అరుదుగా బయటికి వస్తుంది.. కాబట్టి కనిపించడం కూడా అరుదేనని భావించవచ్చు. ఇటీవలే కొంతమంది వీడియో ఫోటోగ్రాఫర్స్ అడవుల్లో సంచారం చేసే క్రమంలో గోల్డెన్ కింగ్ కోబ్రా బయటికి వచ్చిన సందర్భంగా కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే..ఈ వీడియోలో ఒక పెద్ద ఉడతతో పాటు గోల్డెన్ కలర్ తో కూడిన అరుదైన నాగుపాము చూడవచ్చు. అంతేకాకుండా ఉడుత కింగ్ కోబ్రా రెండు దాడికి దిగడం మీరు గమనించవచ్చు. ఇలా రెండు ఒకదానికొకటి సై అంటూ సై అని దాడికి దిగి ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడం మీరు గమనించవచ్చు..
ఉడుత ఏమాత్రం తగ్గకుండా పాము పై దాడి చేయడం మీరు గమనించవచ్చు. ఇలా ఇలా రెండు దాదాపు మూడు నిమిషాలకు పైగానే దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో భాగంగా ఆ గోల్డెన్ కింగ్ కోబ్రా ఉడత నుంచి తప్పించుకునేందుకు పారిపోవడం మీరు గమనించవచ్చు. ఉడుత చేతిలో నుంచి తప్పించుకునేందుకు భారీ కింగ్ కోబ్రా చెట్లపొదల్లోకి పారిపోతుంది. ఇంతటితో వీడియో ఎండ్ అవుతుంది.. ప్రస్తుతం ఈ రెండు దాడి చేసుకోవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పాము ఉడుత దాడికి సంబంధించిన వీడియోను @ది వరల్డ్ టూర్ 123 అనే యూట్యూబ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఇప్పటివరకు 152 కు పైగా మంది లైక్ చేశారు. అలాగే కొన్ని వేల మందికి పైగా ఈ వీడియోని వీక్షించారు.
AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి