Egg Shells For Hair Growth: ఈసారి గుడ్డు పెంకులను పారేయకుండా జుట్టుకు ఉపయోగించండి ఆరోగ్యకరమైన మందపాటి జుట్టు పొడుగ్గా పెరుగుతూనే ఉంటుంది ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ గుడ్డు పెంకులో కాల్షియం ఉంటుంది దీంతో పాటు ఇందులో అనేక ఖనిజాలు కూడా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
గుడ్డు పెంకులో ఉండే కాల్షియం వల్ల హెయిర్ ఫాలికల్ బలంగా మారుతాయి.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది మంచి పోషణ అందిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రేరేపిస్తుంది.. ముఖ్యంగా స్ప్లిట్ ఎండ్ సమస్యకు ఇది ఎఫెక్టివ్ రెమిడీ. గుడ్డులో కాల్షియం మాత్రమే కాకుండా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇంకా మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ జుట్టు ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడతాయి.
గుడ్డు పెంకులు జుట్టుకు ఉపయోగించడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలంగా మారి.. ఆరోగ్యంగా పెరుగుతాయి.. ముఖ్యంగా ఇందులోని కాల్షియం కెరటీన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. జుట్టు రాలే సమస్యకు చెక్ పెడుతుంది. మన శరీరానికి కాల్షియం ఎలా కావాలో జుట్టుకు కూడా క్యాల్షియం తప్పనిసరిగా ఉంటుంది. దీంతో త్వరగా తెల్ల వెంట్రుకలు రావు. జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది..
గుడ్డు పెంకుల్లో ఉండే క్యాల్షియం వల్ల పీహెచ్ స్థాయిలు సమతూలంగా ఉంటాయి. ఇది డాండ్రఫ్ సమస్యను నివారిస్తుంది.. అంతేకాదు తలలో ఉండే దురదకు కూడా ఇది మంచి రెమెడీగా పనిచేస్తుంది.. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. గుడ్డు పెంకులను క్రష్ చేసి అప్లై చేయడం వల్ల మంచి ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. దీంతో డెడ్ స్కిన్ సెల్స్ కూడా తొలగిపోతాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడతాయి.
గుడ్డు పెంకులు జుట్టు పెరుగుదలకు ఉపయోగించే విధానం..
జుట్టుకు గుడ్డు పెంకులు అప్లై చేసే ముందు వాటికి కావాల్సిన వస్తువులు తీసుకోవాలి. గుడ్డు పెంకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. దీంతో అందులో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది. లేకపోతే ఏదైనా బేకింగ్ షీట్‌లో కూడా వీటిని ఆరబెట్టవచ్చు. ఇలా ఆరబెట్టిన తర్వాత సులభంగా మనం క్రష్ చేసుకోవచ్చు. బాగా ఎండిన గుడ్డు పెంకులను ఒక బ్లెండర్లో లేదా ప్రాసెసర్‌లో వేసి మెత్తని పౌడర్ తయారు చేసుకోవాలి. అప్పుడు జుట్టుకు మాస్కుల అప్లై చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇప్పుడు గుడ్డు పెంకుల పొడిని మంచి ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకొని పెట్టాలి. నేరుగా సన్‌లైట్ తగలకుండా.. మాయిశ్చర్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో బ్యాక్టీరియా కూడా సోకకుండా ఉంటుంది..
ఇలా తయారు చేసుకున్న గుడ్డు పెంకుల పొడిని కొబ్బరి నూనెతో కలిపి జుట్టు అంతటికీ కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇది నేచురల్ మాయిశ్చరైజర్ల పని చేస్తుంది. మంచి పోషణ అందిస్తుంది. ఇందులోని ఖనిజాలు జుట్టు కుదుళ్లకు బాగా అందుతాయి. ఈ రెండిటితో హెయిర్ మాస్కు వేసుకోవడం వల్ల హెయిర్ ఫాలికల్ కూడా బలంగా మారుతాయి. స్ప్లిట్ ఎండ్ సమస్యకు ఎఫెక్టివ్ రెమిడీ.
ఇదీ చదవండి: బొప్పాయి ఈ పండుతో పొరపాటున తినకూడదు.. కడుపునొప్పి గ్యారెంటీ..
ఒక టీ స్పూన్ గుడ్డుపెంకు పొడిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టు అంతటికీ కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇప్పుడు ఒక గంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. ఈ మాస్కుని వారంలో ఒకసారి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఈ పొడిని షాంపూలో వేసి తలంతటికి పట్టించవచ్చు. ఇందులోని ఖనిజాలు జుట్టుకు బాగా అందుతాయి. ఈ ఎగ్ షెల్ పొడి కుదుళ్లకు మంచి పోషణ అందించి, జుట్టు బలంగా మారేలా చేస్తుంది. షాంపూలో రెండు టేబుల్ స్పూన్ల కోడిగుడ్డు పెంకుల పొడిని వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత జుట్టు అంతటికీ పట్టించి మసాజ్ చేయాలి.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి కండిషనర్ కూడా ఉపయోగించాలి.
ఇదీ చదవండి: తెల్లమిరియాలు తింటే ఆ రోగాలు ఫసక్.. రక్తంలో షుగర్ కంట్రోల్..
ఇది కాకుండా కలబంద, కోడిగుడ్డు పెంకుల పొడి కూడా రెండిటిని కలిపి జుట్టుకు పట్టించడం వల్ల మంచి పోషణ అందిస్తుంది. ఎగ్ షెల్ పొడి ఒక స్పూను, రెండు చెంచాల అలోవెర్ జెల్ వేసి బాగా కలపాలి.. జుట్టు అంతటికి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇది కాకుండా మీరు కోడిగుడ్డు పెంకులతో ఆలివ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. తలస్నానానికి ముందు ఈ రెండిటిని కలిపి జుట్టు అంతటికీ పట్టించి తల స్నానం చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.