Jatadhara: ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా ప్రొడ్యూసర్స్ గా సుధీర్ బాబు హీరోగా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’ మూవీ పూజా కార్యక్రమంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలెంటెట్ డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రీ నిర్మాత రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, డైరెక్టర్ మోహన ఇంద్రగంటి, శిల్పా శిరోధ్కర్ ఛీప్ గెస్టులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్‌లో సమర్ఫణలో జటాధర మూవీ సూపర్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీగా రాబోతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం హ్యాపీగా ఉందన్నారు. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించే సినిమా ‘జటాధరా’ అని చెప్పుకొచ్చారు.
జటాధర సినిమా కథను పూర్తిగా అనంత పద్మనాభ స్వామి ఆలయం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు మేకర్స్ తెలియజేసారు. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నట్టు చెప్పారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోందన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
‘జటాధర’మూవీ సుధీర్ బాబు కెరీర్ లో పూర్తి ఢిఫరెంట్ మూవీ అని చెబుతున్నారు. అంతేకాదు యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రానుంది. థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో ‘జటాధరా’ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఈ సినిమా పూర్తి ఉత్కంఠ భరితంగా ‘జటాధర’ మూవీ నిధి కోసం పోరాటం జరుగుతుంది.. కానీ పోరాడాలంటే కొన్ని శాపాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పోరాటం ఏమిటి? ఈ శాపం ఏమిటి? అని తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.