Modi US Tour: ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటనలో పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్‌ఎక్స్ సీఈవో, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్‌లో నరేంద్ర మోడీ సమావేశయ్యారు. మోడీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్‌హౌస్‌కు ఆయన గురువారం తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు.
ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. అంతరిక్షం, సాంకేతికత, నవకల్పనలు సహా పలు అంశాలపై మస్క్‌తో చర్చించినట్లు మోడీ ఎక్స్‌లో తెలియజేశారు. 'కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన' కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొస్తున్న సంస్కరణలను ఆయనకు వివరించినట్లు చెప్పారు.మరోవైపు- అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్ వాల్జ్ కూడా నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. సంబంధిత వివరాలను ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. వాటిపై వాల్జ్‌తో చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..
కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు ప్రధాన మంత్రి. వాల్జ్‌ను భారత్‌కు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. ఈ భేటీల్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.