Trump Ukrain: ఉక్రెయిన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. రష్యాలో భాగం కావొచ్చు..

Trump Ukrain: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే  రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్‌ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2025, 10:01 AM IST
Trump Ukrain: ఉక్రెయిన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. రష్యాలో భాగం కావొచ్చు..

Trump Ukrain: ట్రంప్ అధ్యక్షుడు  ఉక్రెయినియన్లు.. రష్యన్లు కావొచ్చు..కాకపోవచ్చన్నారు. ఈ విషయంలో  ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావచ్చు. రాకపోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో ఉక్రెయిన్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం మ్యానిచ్‌లో జెలెన్‌స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఉక్రెయిన్‌పై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధాన్ని సంధి కుదిర్చారు. మరోవైపు పశ్చిమాసియాలో యుద్దాన్ని ఆపడం కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ భేటి కానున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించడం వంటి అంశాలతో పాటు అమెరికా విధిస్తున్న వాణిజ్య సుంకాల అంశం కూడా ప్రస్తావనకు రానుంది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News