Vamsi Arrest: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఎన్నికల సమయంలో నారా లోకేశ్ చెప్పిన రెడ్ బుక్ తెరపైకి వచ్చింది. ఒక్కొక్కరిగా వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ అరెస్టులు మొదలయ్యాయి. తాజాగా వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లేడీ కానిస్టేబుల్‌తో కొట్టించి అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఇదే ఇప్పుడు వివాదం రేపుతోంది.
వాస్తవానికి వల్లభనేని వంశీ కోసం ఏపీ పోలీసులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముదునూరి సత్యవర్ధన్ అనే వ్యక్తిని వల్లభనేవి వంశీ కిడ్నాప్ చేయించారనే కేసులో వంశీపై నిఘా పెంచగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ఫాం హౌస్‌లో ఉన్నారని తెలుసుకున్నారు. ఓ ప్రముఖ వైసీపీ నేత పార్టీకు హాజరయ్యారు.ఆ తరువాత హైదరాబాద్‌లోని తన నివాసంలో మద్యం మత్తులో ఉండగా ఇవాళ తెల్లవారుజామున
పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కేవలం అండర్ బనియన్, షార్ట్ తో ఉండటంతో బట్టలు మార్చుకుని వస్తానని చెప్పి వంశ తప్పించుకునే ప్రయత్నం చేశారని పోలీసులు చెబుతున్నారు. దాంతో మహిళా కానిస్టేబుల్ వంశీని పట్టుకుని దేహశుద్ధి చేసి..అరెస్టు చేశారు. వంశీని కావాలనే మహిళా కానిస్టేబుల్ తో కొట్టించారని, ఇదంతా ప్రతీకార రాజకీయాలని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వల్లభనేని వంశీపై బీఎన్ఎస్ సెక్షన్ 140 (1), 308,35(1) రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదయ్యాయి. అదే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ పని చేయకుండా మహిళా కానిస్టేబుల్‌తో కొట్టించి తీసుకెళ్లడంపై మండిపడుతున్నారు.
Also read: Election Survey 2025: దేశంలో ఇప్పుడు ఎన్నికలొస్తే అధికారం ఏ పార్టీదో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి