Delhi Assembly Election Results 2025: ఢిల్లీకి జరిగిన శాసనసభ ఎన్నికల్లో 27 యేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు చుక్కలు చూపించారు. అంతేకాదు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలు కావడంతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు పై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమైంది.తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన ఆర్ధిక బడ్జెట్ కీ రోల్ పోషించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవును మొన్నటి వరకు పాప్ కార్న్ సహా ఏ వస్తువు రేటు పెరిగినా.. అందరు నిర్మలమ్మనే ఆడిపోసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు ఓకే చేస్తేనే ఈ రేట్లు పెరుగుతాయి. కానీ అవన్ని దాచిపెట్టి ప్రతి వస్తువు రేటు పెరగడం వెనక నిర్మలమ్మ హస్తమే ఉందనే ఆరోపణలు చేసారు. తగ్గిస్తే తమ ఘనతగా ఆయా రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి.
నిర్మలా సీతారామన్.. వరుసగా 8వ సారి లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మహిళ నేతగా రికార్డు సృష్టించారు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన నిర్మలమ్మ.. అదే మధ్య తరగతిని ఏనాడు పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంది. అంతేకాదు బడ్జెట్ లో పేదలను పట్టించుకోదు. కానీ ఆమె వచ్చిన తర్వాతే రెండు సార్లు ఇంకమ్ టాక్స్ శ్లాబ్స్ మరాయి.
తాజాగా 2025-26 యేడాదికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఇంకమ్ టాక్స్ భారీగా తగ్గించడం వంటివి మధ్యతరగతి వర్గాల్లో సానుకూలత కలిగేలా చేసింది. అది ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఐటీ ఎంప్లాయిస్ మన్ననలు అందుకుంది. మరోవైపు స్విగ్గీ, జెమాటో, అమెజాన్ వంటి వాటికి పనిచేసే గిగ్ వర్కర్ల గురించి బడ్జెట్ లో ఆలోచన చేయడం కూడా ప్లస్ పాయింట్ గా మారింది. వాళ్లకు పింఛన్ ఇచ్చే ఆలోచనకు శ్రీకారం చుట్టడం వంటివి ఆయా గిగ్ వర్కర్ల కుటుంబాలు కూడా బీజేపీకి దగ్గరయ్యేలా చేసింది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ముఖ్యంగా గిగ్ వర్కర్లకు ప్రధానమంత్రి జనారోగ్య యోజన కింద ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం వంటివి ఢిల్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. అదే సందర్భంలో వాళ్ల జిఎస్టి తరహాలో వాళ్ల దగ్గర నుంచి ప్రతి లాభావాదేవి మీద కొంత శాతాన్ని మినయించి సామాజిక భద్రత
నిధిలో జమ చేయించి ఆ నిధి నుంచి పింఛన్ చెల్లించే ఆలోచనకు చేయడం పెద్ద పరిణామం. మొత్తంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతితో పాటు ఉద్యోగులు మనసులు చూరగొనడం వల్లే ఢిల్లీ సింహాసనంపై బీజేపీ కాషాయ జెండా ఎగరేసింది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.