Delhi Assembly Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేసారు అక్కడి ఓటర్లు. గతంలో రెండు సార్లు అదే చీపురుతో ఇతర పార్టీలను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ ఎన్నికల్లో బీజేపీ దిమ్మ దిరిగేలా చేసింది. ఏకంగా ఆ పార్టీ అధినేతను న్యూ ఢిల్లీ స్థానం లో ఓడించింది. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసింది.ఆతీశి మినహా మిగతా అగ్ర నేతలంతా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో న్యూ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ను భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ ఏకంగా 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జంగ్పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో572 స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. షాకూర్ బస్తీలో ఆప్ నేత సత్యేంద్ర జైన్ కూడా తన సమీప బీజేపీ అభ్యర్ధి కర్నాల్ సింగ్ చేతిలో 19 వేల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఇక ఢిల్లీ సిట్టింగ్ ముఖ్యమంత్రి అతీశి మార్లెనా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రమేష్ బిదూరిపై 989 ఓట్లతో విజయం సాధించడం ఆ పార్టీకి స్వల్ప ఊరట. బీజేపీ గెలుపుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి పలు అంశాలు కీలకంగా మారింది. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఆ పార్టీ ఇమేజ్ ను మధ్య తరగతి ప్రజల్లో పలుచన చేసింది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
మరో వైపు అధికార దాహం, అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. అదే అవినీతికి పాల్పడం ఈ పార్టీ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బ తీసింది. మరోవైపు కేంద్రంతో నిత్యం సంఘర్షణ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కీలకంగా మారింది. ఒక ప్రధాన మంత్రిగా ఢిల్లీ పీఠంపై ఉన్నా.. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నరేంద్ర మోడీ కల నెరవేరినట్టైయింది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.