Delhi Assembly Election Results 2025: అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు చేస్తోన్న అవకతవకలు, అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో లైమ్ లైట్లోకి వచ్చారు అరవింద్ కేజ్రీవాల్. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీలో మూడు సార్లు అధికారం చేపట్టారు. 2013లో మొదటి సారి కేవలం 2 నెలలోపే సీఎం పీఠంపై కూర్చొన్న అరవింద్ కేజ్రీవాల్ .. 2015, 2020లో వరుసగా రెండు సార్లు క్లీన్ స్వీప్ చేసారు. మొదటిసారి 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో విజయం సాధించి సంచలనం రేపింది. ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 స్థానాలను గెలిచి ఢిల్లీలో తన పట్టును నిలుపుకుంది. ఏ అవినీతి వ్యతిరేకంగా అధికారంలో వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ .. అదే అవినీతి కూపంలో కూరుకుపోయారు. ముఖ్యంగా మధ్యం, అధికారం, ధన వ్యామోహానికి వ్యతిరేకంగా సీఎం అయ్యారో.. అవే అతన్ని తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యేలా చేసాయని అరవింద్ కేజ్రీవాల్ గురువైన అన్నా హజారే వ్యాఖ్యానించారు.
పదవీ, ధన వ్యామోహమే కేజ్రీవాల్‌ను ఓడించాయన్నారు ప్రముఖ సామాజిక వేత్త అన్నాహజారే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన లిక్కర్ ఆరోపణలే కేజ్రీవాల్ కొంప ముంచాయని స్పష్టం చేశారు. మొదట సమాజం కోసం అన్న కేజ్రీవాల్ ఇప్పుడు పదవి కోసం, డబ్బు కోసం, మద్యం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. అలాగే మద్యం షాపులను ప్రోత్సహించడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. అదే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కొంప ముంచాయన్నారు.
- ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు భారీ షాక్ తగిలింది. అగ్రనేతలంతా ఓటమి పాలయ్యారు. ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఘోరంగా ఓటమిపాలయ్యారు. కేజ్రీవాల్‌పై 3వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ పై, మనీష్ సిసోడియాపై జంగ్పురలో 572ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు. ఇక ఢిల్లీ సిట్టింగ్ సీఎం అతీశి బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై 989 ఓట్లతో స్పల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.