Delhi Assembly Election Results 2025: ఢిల్లీలో ఆప్ ఎదురీత.. ఓటమికి అసలు కారణాలు ఇవే..

Delhi Assembly Election Results 2025: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు 27 సుధీర్ఘ విరామం తర్వాత బీజేపీ జెండా ఎగరేయబోతుంది. మరోవైపు వరుసగా రెండు సార్లు పూర్తిగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. రెండు సార్లు ఔట్ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన చీపురు పార్టీకి అక్కడ ప్రజలు చీత్కరించారు. ముఖ్యంగా ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని ఓడించేలా చేసాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 8, 2025, 12:51 PM IST
Delhi Assembly Election Results 2025: ఢిల్లీలో ఆప్ ఎదురీత..  ఓటమికి అసలు కారణాలు ఇవే..

Delhi Assembly Election Results 2025: జాతీయ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఢిల్లీ  ఎన్నికల్లో  1998 తర్వాత దాదాపు 27 యేళ్లకు అంటే ఆరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ తన వశం చేసుకోవడంతో కాషాయ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ సామాన్యులకు చేరువైన ఈ పార్టీ.. ఆమ్ ఆద్మీ అంటే సామాన్య ప్రజలకు దూరం కావడమే ఆ  పార్టీ ఓటమికి ముఖ్యకారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా సామాన్యుడిలా ఉంటా అని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్.. కొన్ని వందల కోట్లు తగేలేసి శీష్ మహల్ నిర్మించుకోవడం. ప్రభుత్వ వాహనాలు వ్యక్తిగతంగా ఉపయోగించమని చెప్పిన ఆ పార్టీ నేతలు చివరకు చెప్పిన వాగ్ధాదాలను జెల్ల కొట్టారు. ప్రజాకర్షణ పథకాలతో ఆప్  పేద మధ్య తరగతి వర్గాల్లో ప్రజాదరణ పొందినా.. స్థానిక సమస్యలు ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. ముఖ్యంగా తాగు నీటి కొరత, పాడైన రోడ్లు, ప్రజా రవాణాలో పలు సమస్యలు ఆప్ పుట్టిని ముంచాయి. మరోవైపు శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్  సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చాయి.

నియోజకవర్గాల వారిగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై ‘చార్జీ షీట్లు’ విడుదల చేస్తూ బీజేపీ ప్రచారం చేయడం ఆప్ ఓటమికి బాటలు వేసింది. ముఖ్యంగా  సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత చాలా పనిచేసింది. ఏకంగా ఢిల్లీ మాజీ సీఎం పోట చేసిన న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు.  

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయంగా చేసిన ఒత్తిడితో కేసులు బనాయించి ఆప్ నేతలను వేధిస్తుందని ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి  సానుభూతి పొందేందుకు ప్రయత్నించినా అది విఫలమైంది. పైగా కేంద్రంతో నిరంతరం ఏదో ఒక గొడవలు. మరోవైపు ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మాటీ మాటీకీ పేచీలు కూడా అక్కడ ఓటర్లకు ఆప్ పై తీవ్ర వ్యతిరేకతను పెంచేలా చేసాయి. కేవలం ఎన్నికలపుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్దిలో భాగంగా కేంద్రంతో పనిచేయాలన్న సృృహ లేకపోవడం ఆప్  కొంపముంచాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో అన్నా హజారే చెప్పిన మద్యం కుంభ కోణంతో పాటు.. ధన వ్యామోహం, పదవీ వ్యామోహాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు నిలిచాయి. ముఖ్యంగా కేంద్రం ప్రకటించిన రూ. 12 లక్షల ఇన్ కమ్ టాక్స్ తో పాటు.. 8వ పే కమిషన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలుగా నిలిచాయి.

మూడు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేజ్రీవాల్ కు ప్రజాదరణ కొంతలో కొంత ఉన్నా..  పార్టీలో ఇతర నేతలు ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఆప్ పార్టీకి  నష్టం చేకూర్చింది. ‘ఇండి’ గ్రూపులో ఆప్, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములైన అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం కూడా పెద్ద నష్టం కలిగించింది. మరోవైపు ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఓట్ల చీలిక కూడా ఆప్ కు ఓటమి పాలు చేసింది. . అదే బీజేపీ కలిసొచ్చందనే చెప్పాలి.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

ఆప్ కు సాంప్రదాయ ఓటర్లుగా  నిలుస్తున్న ముస్లిం, దళిత ఓట్లను కాంగ్రెస్ చీలుస్తుండడంతో ఆప్ కు తీవ్ర నష్టం చేకూర్చింది.     కేంద్రంలో వరుసగా బీజేపీకి అధికారంలోకి రావడం, అదే సమయంలో రాష్ట్రంలో వరుసగా ఆప్ అధికారంలోకి వస్తుండడంతో రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ పోరుతో ఢిల్లీ లో అభివృద్ధి కుంటు పడుతుందనే అభిప్రాయం కూడా ఓటర్లలో కనిపించింది. మొత్తంగా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ఢిల్లీలో ఆప్ ఓటమికి ఇవి కలిసొచ్చిన అంశాలు అని చెప్పాలి. ,

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News