Delhi Election Results 2025 Live: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. గత రెండు పర్యాయాలు.. దాదాపు ఢిల్లీ శాసనసభ క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సారి ఎన్నికల్లో బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ స్థానం నుంచి బరిలో దిగిన మాజీ ముఖ్యమంత్రి వెనుకంజలో ఉన్నారు. ఆయనపై బీజేపీ ఢిల్లీ ఫైర్ బ్రాండ్ పర్వేష్ సింగ్ వర్మ ముందంజలో ఉన్నారు. మరోవైపు కల్కాజీ స్థానంలో ఆతిషీ వెనకంజ వేసింది. మరోవైపు పత్ పర్ గంజ్ నుంచి ఆప్ అభ్యర్థి వెనకంజలో ఉంది.
1993లో ఢిల్లీలో అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీకి 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఆ తర్వాత 2013, 2015, 2020 ఎన్నికల్లో బీజేపీకి అధికారం అందని ద్రాక్ష అయింది. దాదాపు ఆరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుదీర్ఘంగా 27 యేళ్ల తర్వాత ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకోనుంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ సీఎం ఫేస్ లేకుండానే ఎన్నికల బరిలో దిగింది. ముఖ్యంగా ఎక్కడక్కడ నియోజకవర్గాల వారీగా తమ వ్యూహాలను అమలు చేసింది. అది ఫలితాల రూపంలో కనిపిస్తోంది. మరి ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈ ఫలితాల నేపథ్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారుకు ఎలాంటి ఢోకా లేకుండా పోతుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో నరేంద్ర మోడీ మరోసారి తిరుగులేని నేతగా మారారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.