Delhi Assembly Elections Results 2025: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. వరుసగా నాలుగోసారి ఢిల్లీ పీఠంపై జెండా ఎగరేయాని ఆమ్ ఆద్మీ పార్టీ.. మరోవైపు 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ.. ఎన్నికల బరిలో నిలిచాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే.. బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తోన్న అరవింద్ కేజ్రీవాల్ వెనకబడ్డారు. మరోవైపు ఆతిషి మార్లెనా వెనకంజలో ఉంది. మొత్తంగా బడ్జెట్ లో కేంద్రం వేతన జీవులకు ప్రకటించిన ఇంకమ్ టాక్స్ మినహాయింపు ఇవ్వడం బీజేపీకి కలిసొచ్చేందని చెప్పాలి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో కొనసాగుతున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. అలాగే కలాకంజ్ నుంచి బరిలో నిలిచిన ఢిల్లీ సీఎం ఆతిశీ, జంగపూర్ నుంచి పోటీలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా వెనుకంజలో ఉన్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో ముందంజలో ఉంది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
మొత్తంగా 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 699 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. మొత్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 శాతం ఓటింగ్ జరిగింది. ఇందులో 94,51,997 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 50.42 లక్షల మంది పురుషులు కాగా.. 44.08 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 403 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 2020లో 62.59 శాతం ఓటింగ్ నమోదు కాగా.. ఈసారి మరింత తగ్గింది. మొత్తంగా ఈ సారి ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్టు బీజేపీ అధికారం చేజిక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.