AP Liquor Prices: ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. మద్యం దుకాణాల యజమానులకు ఇస్తున్న మార్జిన్ పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అంటే ఇకపై రాష్ట్రంలో మందు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పుడున్న ధరల కంటే కనీసం 15 శాతం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నాణ్యమైన మందు, తక్కువ ధరకు అందిస్తామన్న ఏపీ ప్రభుత్వం ప్రకటన ఎంతోకాలం అమలు కావడం లేదు. త్వరలో మందు బాబులకు తాగిన మత్తు దిగిపోనుంది. మద్యం ధరలు భారీగా పెరకబోతున్నాయి. గత కొద్ది కాలంగా లిక్కర్ షాపు యజమానులకు చెల్లించే మార్జిన్ సరిపోవడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మద్యం విధానంలో లక్షలు కేటాయించి మద్యం దుకాణాలను సొంతం చేసుకున్న యజమానులు నిర్వహణ కష్టమౌతుందంటూ ఆవేదన చెందుతున్నారు. అందుకే ప్రభుత్వం మార్జిన్ పెంచేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న 14.5 శాతం మార్జిన్ సరిపోవడం లేదని, 20 శాతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా త్వరలో అంటే ఎమ్మెల్సీ ఎన్నగల అనంతరం మార్జిన్ 20 శాతం చేసే పరిస్థితి కన్పిస్తోంది. అదే జరిగితే మందు ధరలు భారీగా పెరగనున్నాయి. కనీసం 15 శాతం పెరగవచ్చని అంచనా. క్వార్టర్ 99 రూపాయలకు విక్రయిస్తున్న చీఫ్ లిక్కర్ తప్పించి మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లపై క్వార్టర్ కనీసం 10 రూపాయలు పెరగవచ్చని అంచనా.
రాష్ట్రంలో గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన వేలం ద్వారా 3 వేలమంది మద్యం షాపుల్ని దక్కించుకున్నారు. మార్జిన్ 20 శాతం లభిస్తుందని భావించారు. కానీ 14 శాతమే ఇస్తుండటంతో నిర్వహణ కష్టమైపోతుందని ఆందోళన చేస్తూ వస్తున్నారు. కమీషన్ పెంచకుంటే అమ్మకాలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు.
Also read: YS Family Dispute: మరోసారి జగనన్నపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి