Delhi Assembly Election Results Live Updates: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. వరుసగా నాలుగోసారి ఢిల్లీ పీఠంపై పాగా వేయాలని ఆప్.. 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ.. మరోసారి ఏమైనా అవకాశం దక్కుతుందా అని ఆశల పల్లకిలో కాంగ్రెస్.. విజయం ఎవరిని వరిస్తుందో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు కావాలి. ఓట్ల కౌంటింగ్ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ కేంద్రాలు ఉండగా.. 10 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాటు చేశారు. ఈ నెల 5న జరిగిన పోలింగ్‌లో 60.54 శాతం మంది ఓటు వేశారు. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇక్కడ ఫాలో అవ్వండి.