Ttd board transferred 18 non hindu employees: తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వార్తలలో నిలిచింది. ఇటీవల కాలంలో తిరుమలలో అనేక వివాదాస్పద అంశాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డు వివాదం, రాజకీయ నేతలు వివాదస్పదంగా మాట్లాడటం చర్చకు దారితీసింది. ఫోటోషూట్ లు, రీల్స్ చేయడం కూడా రచ్చగా మారింది. పవిత్రమైన తిరుమల కొండపై నాన్ వెజ్ ఆనవాళ్లు దొరకడం, అన్యమత ప్రచారం కూడా తిరుమలలో వివాదాస్పద అంశంగా మారిందని చెప్పుకొవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. తిరుమల శ్రీవారి కైంకర్యాలలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటుంది. ఇటీవల కొత్తగా టీటీడీ బొర్డును సైతం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బీఆర్ నాయుడు టీటీడీకి చైర్మన్ గా ఉన్నారు. అయితే..తాజాగా.. టీటీడీలో ఉన్న అన్యమతస్థులను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొలివిడతగా.. 18 మంది అన్య మతస్థులను ఇతర శాఖల్లోకి బదిలి చేశారు.
అదే విధంగా టీటీడీలో ఉన్న అన్యమతస్థులు స్వచ్చంగా ఇతర శాఖల్లోకి వెళ్లడం లేదా రిటైర్ మెంట్ తీసుకొవచ్చని టీటీడీ స్పష్టంగా తెల్చి చెప్పింది. తొలి విడతగా.. టీటీడీ అన్యమతస్థులు 69 మంది ఉన్నట్లు ఒక జాబితా రూపొందించింది. మొత్తంగా చూస్తే 350 మంది వరకు ఇతర శాఖల్లో కూడా పనిచేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
శ్రీవారి ఆదాయంను జీతాలుగా తీసుకుంటూ.. స్వామివారిపై నమ్మకం లేకుండా.. గుట్టుగా అన్యమత ప్రచారం పట్ల టీటీడీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గతంలో టీటీడీ చీఫ్ గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఆయన అనుమానం ఉన్న ఉద్యోగుల ఇంటికి నేరుగా వెళ్లి పరిశీలన చేసేవారు. అప్పట్లో పలువురు ఇలా మతం మారిన ఉద్యోగుల్ని పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత ఆయన హఠాత్తుగా బదిలీ అయ్యారు.
Read more: PM MOdi: కుంభమేళాలో మోదీ పుణ్యస్నానం.. ఆయన సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా..?
గతేడాది.. నవంబర్ 18, 2024 టీటీడీ బోర్డు తీర్మానం, ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో చాలా మంది ఉద్యోగాలు పొందారు.. కానీ కొంత మంది హిందుయేతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరంత.. ఇక మీదట స్వామి వారి సేవల్లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించిన వదిలేదీ లేదని టీటీడీ హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter