Tax Deduction Tips: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. కొత్త ట్యాక్స్ విధానంలో 12 లక్షల రూపాయ వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదనేది ఆ ప్రకటన సారాంశం. కానీ సరిగ్గా లెక్కలేస్తే 12 లక్షలు కాదు..ఇంకా ఎక్కువ అంటే 14.65 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ట్యాక్స్ పేయర్లకు మినహాయింపు ఇవ్వడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు ఆర్ధికంగా లబ్ది చేకూరుతుంది. ప్రజల చేతిలో డబ్బులు ఉంటాయి. కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకున్నవారికి 2025-26 ఆర్ధిక సంవత్సరం నుంచి ఇది వర్తిస్తుంది. అంటే 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కానీ కొంతమంది నిపుణుల ప్రకారం 14.65 లక్షల ఆదాయం వరకూ కూడా ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఓ వ్యక్తి వార్షిక ఆదాయం 14.65 లక్షల రూపాయలుంటే అందులో 5 శాతం డబ్బులు కనీస వేతనం పరిధిలో ఉంటాయి. మిగిలిన 50 శాతం డబ్బులు ఇతర అలవెన్సుల రూపంలో ఉంటాయి. అంటే 7,32,500 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. ఈ లెక్కన ట్యాక్స్ మినహాయింపు ఉన్నట్టే.
12 లక్షలకు అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ 75 వేల రూపాయలు ఉంటుంది. పీఎఫ్ కింద ఉద్యోగి వాటాగా ఇచ్చే 12 శాతం కనీస వేతనంపై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. అంటే ఇది 87,90 రూపాయలు. అది కాకుండా ఎన్పీఎస్ ఎక్కౌంట్ పరిధిలో వచ్చే 14 శాతం కనీస వేతనం 1,02,550 రూపాయలు ఉంటుంది. దీనిపై కూడా ట్యాక్స్ ఉండదు.
అంటే ఈపీఎఫ్, ఎన్పీఎస్ కలుపుకుని 2,65,450 రూపాయలకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఈ మొత్తాన్ని 14.65 లక్షల నుంచి తొలగిస్తే ట్యాక్స్ పరిధిలో వచ్చే ఆదాయం 11,99,550 రూపాయలు అవుతుంది. ఇది ప్రభుత్వం ప్రకటించిన 12 లక్షల కంటే తక్కువే. అంటే ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
Also read: PPF Updates: పీపీఎఫ్ పధకంతో నెలకు 39 వేల జీరో ట్యాక్స్ ఆదాయం, ఎలాగో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి