Bhavani Ward 1997 Movie Pre Release Event: హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో జీడీ నరసింహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భవానీ వార్డ్ 1997’. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా సంయుక్తంగా నిర్మించగా.. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. భవానీ వార్డ్ 1997 మూవీ టైటిల్ పోస్టర్‌ను తానే లాంచ్ చేశానని చెప్పారు. మూవీ విడుదల సమయం దగ్గర పడుతుంటే.. టీమ్‌కు టెన్షన్ ఉంటుందన్నారు. ఈ సినిమాను అందరూ ఎంతో కష్టపడి తీశారని.. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు. తనకు హర్రర్ సినిమాలంటే ఇష్టమని.. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. చిన్న సినిమాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయని.. ఇలాంటి మూవీకి అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. మంచి సక్సెస్ ఇవ్వాలన్నారు.
డైరెక్టర్ జీడీ నరసింహా మాట్లాడుతూ.. సినిమాలో అందరూ అద్భుతంగా నటించారని.. అన్ని పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. మ్యూజిక్ అందరినీ భయపెట్టేలా ఉంటుందని.. విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయన్నారు. ఈ నెల 7న తమ సినిమా రానుందని.. అదే రోజు తండేల్ సినిమా వస్తుందని.. అన్ని సినిమాలను సపోర్ట్ చేయాలని కోరారు. హార్రర్ సినిమాలను ఇష్టపడేవారికి తమ భవానీ వార్డ్ 1997 నచ్చుతుందన్నారు.
నటుడు గణేష్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సీరియల్స్ నుంచి సినిమాకి రావడానికి ఎంతో కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు. తాము పడిన కష్టాన్ని ఎవరూ చూడరని.. అందరూ ఔట్‌పుట్‌నే చూస్తారని అన్నారు. ట్రైలర్ అందరికీ నచ్చిందని.. సినిమా కూడా నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు. పూజా కేంద్రే మాట్లాడుతూ.. తనకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. పూర్తి హార్రర్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. పర్వతనేని రాంబాబు, సాయి సతీష్ మాట్లాడుతూ.. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందన్నారు. థియేటర్‌లో ప్రతి ఒక్కరు చూసి మంచి విజయాన్ని అందించాలని కోరారు.
Also Read: Highest FD rates: బ్యాంకుల బంపరాఫర్.. ఈ బ్యాంకుల్లో అత్యధిక వడ్దీ..ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.