Chaganti Koteshwar Rao: ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు తిరుమల పర్యటనలో అవమానం జరిగిందనే వార్త సంచలనం రేపింది. తిరుమల యాత్రలో భాగంగా టీటీడీలో అవమానం అంటూ దుష్ప్రచారం చేసిన వారిపై టీటీడీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. పలు సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నడుస్తున్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై తిరుమల అధికారులు తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాలో అత్యాద్భుతం.. 154 ఏళ్ల మనిషి ప్రత్యక్షం
చాగంటి కోటేశ్వర రావు జనవరి 14వ తేదీన తిరుమలలో పర్యటించారు. ఈ పర్యటనపై వాస్తవ సమాచారాన్ని అధికారికంగా వెల్లడించినా సదరు సోషల్ మీడియా ప్రతినిధులు (డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్) పట్టించుకోకుండా పదే పదే టీటీడీ ప్రతిష్టను దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేశారని టీటీడీ ఆరోపించింది. దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారని భావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతి యూనివర్సిటీ పోలీసులకే కాకుండా న్యూఢిల్లీలో, విజయవాడలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు కూడా ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా.. చాగంటి కోటేశ్వర రావు ఆధ్యాత్మిక అభిమానుల మనోస్థైర్యాన్ని పలుచన చేసేలా విష ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ కోరింది.
Also Read: Mauni Amavasya 2025: రేపు మౌని అమావాస్యకు ఈ దానాలు చేస్తే ఆకస్మిక ధనలాభం.. పూర్వీకుల ఆత్మశాంతి
జనవరి 14వ తేదీన చాగంటి శ్రీవారి దర్శనం, 16న సాయంత్రం టీటీడీకి చెందిన మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు టీటీడీ ఆదేశాలు ఇచ్చింది. వారికి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం చాగంటికి రాచ మర్యాదలు చేయగా ఆయన తిరస్కరించారని టీటీడీ వెల్లడించింది. రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు ఏర్పాట్లు చేయగా చాగంటి తిరస్కరించారని వివరించింది. వాస్తవాలు తెలుసుకోకుండా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా.. టీటీడీని పలుచన చేస్తూ ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను ప్రచారం చేశారని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.