న్యూఢిల్లీ: కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా భారత్‌లో 21రోజుల పాటు లాక్డౌన్ విధించడం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కరోనా వైరస్‌పై, లాక్‌డౌన్‌పై జోక్స్‌తో పాటు దుష్ప్రచారం సైతం అదే స్థాయిలో జరుగుతుందని గుర్తించారు. దీంతో భారత్‌లోని తమ వినియోగదారులకు వాట్సాప్ సంస్థ షాకిచ్చింది. వాట్సాప్ స్టేటస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
వాట్సాప్ స్టేటస్ వీడియో నిడివిని కేవలం 15సెకన్లకు పరిమితం చేశారు. ఆదివారం వరకు 30సెకన్ల నిడివి ఉన్న వీడియోను వాట్సాప్ స్టేటస్‌గా అప్లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. వాట్సాప్ తాజా నిర్ణయంతో భారత్‌లోని వినియోగదారులు 15సెకన్ల వీడియోలను మాత్రమే తమ స్టేటస్‌గా అప్లోడ్ చేయవచ్చు. కరోనా వైరస్ మహమ్మారిని భారత్ జయించేంత వరకు ఈ నిబంధన అమలులో ఉండనుంది. కరోనాపై జోక్స్, వదంతులు ఇలాగే కొనసాగితే వాట్సాప్ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!
కరోనా భయాల నేపథ్యంలో వాట్సాప్ వీడియో కాలింగ్ విపరీతంగా పెరిగిపోయిందని, వాట్సాప్‌లో పోస్టులు, స్టేటస్లు అప్ లోడ్ చేయడం ఎక్కువైందని ఇటీవల ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు. కరోనాపై మీమ్స్, జోక్స్, వీడియోలు చేసి వాట్సాప్ స్టేటస్‌గా అప్లోడ్ చేయడం వల్ల సోషల్ ట్రాఫిక్ అధికమై వాట్సాప్ వీడియో కాలింగ్‌కు సైతం సర్వర్ ఇబ్బందులు తలెత్తుతున్నాయిని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ