Sun Petrochemicals Investment: విదేశాల్లో తెలంగాణ సత్తా చాటుతోంది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణకు విశేష ప్రాధాన్యం దక్కుతోంది. రాష్ట్రంలో అన్ని రకాల పరిశ్రమలకు వాతావరణం అనుకూలంగా ఉండడంతోపాటు అన్ని వనరులు అందబాటులో ఉన్న కారణంగా పెట్టుబడులు వరదలా తరలివస్తున్నాయి. ఒకే రోజు రూ.55 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. పదేళ్ల తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ పెట్టుబడి రావడం విశేషం.
Also Read: Telangana Investments: దావోస్‌లో తెలంగాణకు జాక్‌పాట్.. రూ.10 వేల కోట్ల భారీ పెట్టుబడి
దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో సన్ పెట్రో కెమికల్స్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ, సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పుతామని.. వీటికి రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెడతామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ పెట్టుబడి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం కావడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
భారీ పంప్డ్ స్టోరేజీ
దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకం చేసింది. సన్ పెట్రో కెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read: K Kavitha: 'రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మూసీ ప్రాజెక్టు.. ఢిల్లీకి డబ్బుల మూటలు తరలించే కుట్ర
మూడు చోట్ల
తెలంగాణలోని నాగర్‌కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు చోట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతామని సన్ పెట్రో కెమికల్స్ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు.. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. భవిష్యత్తు ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రభుత్వ అధికారులు చెప్పారు.
తెలంగాణ అగ్రగామి
హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. తాము చేపట్టబోయే ప్రాజెక్టు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని సన్ పెట్రో కెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వీ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.