Chandrababu Naidu: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం..

Supreme court on skill scam case: స్కిల్ స్కామ్ కేసులో ఏపీ ముఖ్య మంత్రికి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 15, 2025, 01:48 PM IST
  • చంద్రబాబుకు భారీ ఊరట..
  • అవసరమైనప్పుడు సహాకరించాలన్న కోర్టు..
Chandrababu Naidu: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం..

Supreme court on skill scam case: స్కిల్ స్కామ్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత వైసీపీ సర్కారు.. చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.  

దీన్ని విచారించిన జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే... ఈ కేసులో ఇప్పటికే చార్జీషిట్ ఫైల్ చేశారని.. ఏపీ సర్కారు తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు.  అందువల్ల బెయిల్ పిటిషన్ పై జోక్యం చేసుకొవాల్సిన అవసరం లేదని వాదనలు విన్పించారు.

ఈ వాదనలతో ఏకీభవించిన.. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ ను  చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కోర్టు వారికి అవసరమైనప్పుడు.. విచారణకు సహాకరించాలని అత్యున్నత ధర్మాసనం చంద్రబాబును ఆదేశించింది. 

ఇదిలా ఉండగా.. చంద్రబాబు బెయిల్ ను  రద్దు చేయాలని ఇంటర్‌లొకేటరీ  అప్లికేషన్‌ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేఖరి బాలగంగాధర్‌ తిలక్‌ పై అత్యున్నత ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. పిల్ దాఖలు చేసేందుకు మీకు ఉన్న అర్హతలు ఏంటని ప్రశ్నించింది. బెయిల్‌ వ్యవహారాల్లో మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ) ఎందుకు ఉంటారని ప్రశ్నించిన ధర్మాసనం సీరియస్ అయింది.

Read more: KT Rama Rao: కేటీఆర్‌కు బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు..

సంబంధ లేని బెయిల్‌ వ్యవహారాల్లో  పిటిషన్‌ ఎలా వేస్తారని  జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలా జరిగితే.. చర్యలుంటాయని కోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో.. బాలగంగాధర్‌ తిలక్‌ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News