YS Abhishek Reddy: వైఎస్ అభిషేక్ మృతిలో ట్విస్ట్.. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారంటూ..!

YS Jagan Brother YS Abhishek Reddy Death News: వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి మృతి వార్తను సుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు ధృవీకరించకపోవడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇంకా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారంటూ వైఎస్ కుటంబ సన్నిహితులు చెబుతున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 8, 2025, 12:38 PM IST
YS Abhishek Reddy: వైఎస్ అభిషేక్ మృతిలో ట్విస్ట్.. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారంటూ..!

YS Jagan Brother YS Abhishek Reddy Death News: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరుడు వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి మృతి చెందినట్లు మంగళవారం రాత్రి వార్తలు రాగా.. ఇప్పటివరకు ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మృతిని వైసీపీ శ్రేణులు ధృవీరిస్తున్నాయి. అయితే వైఎస్ అభిషేక్ రెడ్డి వెంటిలేటర్‌పై ఇంకా చికిత్సలో ఉన్నారని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన వెలువడే వరకు ఎటువంటి పోస్టులు పెట్టవద్దంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులకు వైఎస్ కుటుంబ సభ్యులు ఆదేశాలు జారీ చేశారు. అభిషేక్ రెడ్డి మృతిపై  క్లారిటీ లేకపోవడంతో వైసీపీ క్యాడర్, పులివెందుల ప్రజలు అయోమయంలో ఉన్నారు. 

వైఎస్ ప్రకాశ్‌ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోదరుడి వరుస అవుతాడు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా వైఎస్ అభిషేక్ రెడ్డి పని చేసిన విషయం తెలిసిందే. గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా లింగాల మండల ఇన్‌చార్జిగా వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు. కడప జిల్లాలో బుధవారం అభిషేక్‌ అంత్యక్రియలు జరగనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. అయితే అధికారిక ప్రకటన రాకపోవడంతో క్లారిటీ రాలేదు.   

మరోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. ఈ రోజు రాత్రికి హైదారాబాద్‌కు చేరుకోనున్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నారు. విదేశాలలో ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులు పులివెందులకు చేరుకున్నాకే వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఎటువంటి చేయలేదు.

వైఎస్ అభిషేక్ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ వ్యవహారాలన్ని గత రెండేళ్లుగా అభిషేక్ రెడ్డి డైరెక్షన్‌లోనే సాగాయి. లింగాల మండల ఇంఛార్జిగా వైసీపీ తరపున 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం YCP వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శి గా ఉన్నారు అభిషేక్ రెడ్డి. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభిషేక్ రెడ్డి.. జగన్ సీఎం అయ్యాకా ఆయనకు దగ్గరయ్యారు. 

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి అన్న ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి. వైఎస్ భారతి కుటుంబానికి చెందిన వాడు. అభిషేక్ రెడ్డే గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉండటంతో అతని స్థానంలో అభిషేక్ రెడ్డిని పోటీ చేయిస్తారనే టాక్ వచ్చింది. అయితే తనకు టికెట్ రాకపోయినా జగన్ కోసం గత ఎన్నికల్లో చురుగ్గా పని చేశారు అభిషేక్ రెడ్డి.

అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గత సెప్టెంబర్ నుంచి విషమంగానే ఉందని తెలుస్తోంది. గత ఆరు నెలలుగా అతనికి వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారని సమాచారం. చావు బతుకుల్లో వైఎస్ జగన్ సోదరుడు అభిషేక్ రెడ్డి అంటూ గత సెప్టెంబర్ లో టీడీపీ షాకింగ్ పోస్టు పెట్టింది. వివేకానంద రెడ్డి హత్యకేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఆకస్మిక మరణాలు అంతుచిక్కని అనారోగ్యంతో అభిషేక్ రెడ్డి విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేసింది. 

Also Read: Modi Tour Advt: లోకేశ్ ఫోటోతో ప్రకటనలు, ఇంకెవరూ మంత్రులు కారా

Also Read: Sreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో డేటింగ్‌లో శ్రీలీల..?.. ఇద్దరు సీక్రెట్‌గా ఏంచేస్తున్నారో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News