విశాఖపట్నం: ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖపట్నంలో మార్చి 18-28 వరకు జరగనున్న మిలాన్ మల్టీలేటెరల్ నావల్ ఎక్సర్‌సైజ్‌పై కరోనావైరస్ ప్రభావం పడింది. 40 దేశాలు పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కరోనావైరస్ చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం నలమూలల నుంచి 40 దేశాలు పాల్గొననున్న నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Coronavirus impact : విశాఖలో నేవీ కార్యక్రమంపై కరోనా ఎఫెక్ట్