Chiranjeevi fires on politics old video viral: పుష్ప2 మూవీ ప్రీరీలీజ్ ఈవెంట్ మాత్రం అల్లు అర్జున్ మెడకు చుట్టుకుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో మాత్రమే కాకుండా.. దేశంలోనే ఈ ఘటన సంచనంగా మారిందని చెప్పుకొవచ్చు. పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
ఈ ఘటనలో మొత్తంగా పోలీసులు.. 18 మందిపై కేసుల్ని నమోదు చేసినట్లు తెలుస్తొంది. అయితే.. ఈ ఘటనను సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో చర్చించడంతో ఈ ఘటన ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుందని చెప్పుకొవచ్చు. అయితే.. తాజాగా, అల్లు అర్జున్ బెయిల్ తర్వాత కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తమ ముందు హజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీచేశారు.
Once Chiranjeevi Gaaru Said :-#AlluArjun #StopCheapPoliticsOnALLUARJUN pic.twitter.com/TuX1rTRCKb
— 𝙑 𝙆 (@AlluArjunCult09) December 24, 2024
బన్నీ మూడు గంటల విచారణ అనంతరం తన ఇంటికి చేరుకున్నారు. అయితే.. ఇప్పుడు బన్నీ వర్సెస్ రేవంత్ సర్కారు మాదిరిగా ఈ ఘటన మారిపోయిందని కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చిరంజీవి వాల్తేర్ వీరయ్య మూవీ 200 డేస్ ప్రొగ్రామ్ సమయంలో మాట్లాడిన మాటలు మరోసారి అభిమానులు వైరల్ చేస్తున్నారు.
గతంలో మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి పార్లమెంట్ లో మాట్లాడం పట్ల ఫైర్ అయినట్లు తెలుస్తొంది. రాజకీయ నేతలు పెద్దల సభలో.. ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు.. మరి ఏ పనీపాటా లేనట్టు సినిమాల గురించి మాట్లాడటం ఏంటని ఈయన ప్రశ్నించినట్లు తెలుస్తొంది.
సినిమాల మీద సినిమాలు చేస్తున్నామంటే మాకు డబ్బులొస్తాయని కాదని.. దీనితో అనేక మంది ఇన్ డైరెక్ట్ గా ఉపాధి దొరుకుందని కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. వీలైతే ప్రభుత్వాలు తమకు ఉండాలని, అణగ దొక్కేందుకు మాత్రం ప్రయత్నించోద్దని కూడా అన్నట్లు తెలుస్తొంది.
అప్పట్లో చిరు.. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకల్లో భాగంగా ఏపీ ప్రభుత్వాన్ని.. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కామెంట్లు చేసినట్లు సమాచారం.. అప్పటి ఈ వీడియో.. ఇప్పటి పరిస్థితులకు కరెక్ట్ గా సరిపోతాయని బన్నీ, మెగా అభిమానులు ప్రస్తుతం చిరు వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.