కరోనా వైరస్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ విక్రయాలు భారీగా పడిపోయాయి. కిలో చికెన్ ధర.. అంతకంతకూ కుదేలైంది. దీంతో మార్కెట్లో చికెన్ కొనే వారు లేక . . దుకాణాలు వెలవెలబోతున్నాయి. చికెన్, గుడ్డు తింటే కరోనా వైరస్ సోకుతుందనే దుష్రచారం జరగడమే దీనికి కారణం.
భారీగా పౌల్ట్రీ మార్కెట్ పడిపోవడాన్ని గమనించిన తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఇంకా పలు సంస్థలు కలిసి హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, సినీనటి రష్మిక పాల్గొన్నారు. వేదికపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు అంతా చికెన్ తిని చూపించారు.
Read Also: 'కరోనా'పై కట్టుకథలు..
చికెన్, గుడ్డు పౌష్టికాహారమని.. మంత్రి కేటీఆర్ అన్నారు. చికెన్, గుడ్డు తినడం వల్ల కరోనా వైరస్ సోకుకుందనడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. మన దేశంలో వంటకాలను బాగా ఉడికించి తింటాం కాబట్టి .. వాటి వల్ల ఎలాంటి వ్యాధులు రావని స్పష్టం చేశారు. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ వస్తుందనే దుష్ర్పచారాలు నమ్మవద్దని సూచించారు. ఈ దుష్ప్రచారాన్ని నివారించేందుకు వైద్యులు, సినీ నటులు ముందుకు రావాలని సూచించారు. తెలంగాణలో త్వరలోనే కొత్త పౌల్ట్రీ పాలసీ తీసుకొస్తామని తెలిపారు.
See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!
తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చికెన్ తినడం వల్ల ఎలాంటి కరోనా సోకదని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ లేదు మిత్రమా..!!