DR Hike Updates: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్, 53 శాతమైన డీఆర్, ఎవరెవరికి లాభం

DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ 53 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు ఉద్యోగులకు డీఏ, ఇటు పెన్షనర్లకు డీఆర్ భారీగా అందనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 4, 2024, 03:48 PM IST
DR Hike Updates: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్‌న్యూస్, 53 శాతమైన డీఆర్, ఎవరెవరికి లాభం

DR Hike Updates: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు శుభవార్త విన్పించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచినట్టే పెన్షనర్లకు డీఆర్ 3 శాతం పెంచింది. పెరిగిన డీఆర్ మొత్తం ఇప్పుడు 50 నుంచి 53 శాతమైంది. కొత్త డీఆర్ అనేది జూలై నెల నుంచి వర్తించనుంది. 

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు , ప్యామిలీ పెన్షనర్లకు ముఖ్య గమనిక, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెన్షనర్లకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్‌ను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచింది. పెరుగుతున్న ద్రవ్యల్బణం నుంచి డీఆర్ అనేది ఉపశసనం కల్గించనుంది. కొత్త డీఆర్ పెన్షనర్లకు జూలై నుంచి వర్తించనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అక్టోబర్ 30న డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఆర్ అనేది కేంద్ర ప్రభుత్వ సివిలియన్ పెన్షనర్లకు వర్తించనుంది. ఆర్మ్డ్ సిబ్బంది పెన్షనర్లు, వారి కుటుంబాలకు లభించనుంది. డిఫెన్స్ సర్వీస్‌లోని సివిలియన్ పెన్షనర్లు, ఆల్ ఇండియా సర్వీసెస్ పెన్షనర్లకు వర్తించనుంది. రైల్వే పెన్షనర్లు, బర్మా, పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రభుత్వ పెన్షనర్లకు కొత్తగా పెంచిన డీఆర్ వర్తిస్తుంది. 

జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల డీఆర్ బకాయిలు కలిపి ఒకేసారి చెల్లిస్తారు. డీఆర్ అనేది రీ ఎంప్లాయ్డ్ గవర్నమెంట్ పెన్షనర్లకు కూడా చెల్లించనున్నారు. ఇక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ కానున్నాయి. బ్యాంకులు ఇతర సంస్థలు ప్రతి ఒక్క పెన్షనర్‌కు డీఆర్ వచ్చేలా చూడాల్సి ఉంది. పెరిగిన డీఆర్ అనేది పెన్షనర్లకు ఆర్ధిక మాంద్యం తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది.

Also read: NEET Exam Pattern: నీట్ పరీక్ష విధానంలో మార్పు, ఇకపై జేఈఈ తరహాలో రెండంచెల్లో పరీక్ష

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News