Fact Check: కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ యువతీ యువకులకు ఉపాధి కల్పించడం కోసం అనేక ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించుకొని అనేక మంది యువతీ యువకులు సశక్తులు అవుతున్నారు. తద్వారా వారు వారి సొంత కాళ్లపై నిలబడి కుటుంబాలను పోషిస్తున్నారు.
ముఖ్యంగా ముద్రా రుణాలు కావచ్చు. స్టార్టప్ ఇండియా వాటి స్కీములను ఉపయోగించుకొని చాలామంది యువత తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం మాత్రమే కాదు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వం పేరుతో కొన్ని అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయి.
వీటిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక ఇంటికి ఒకే ఉద్యోగం అనే స్కీం ప్రవేశపెట్టిందని, ఇందులో భాగంగా చదువు రాని వారికి 16 వేల జీతం, 8వ తరగతి పాస్ అయిన వారికి 25 వేల జీతం, 10 పాసైతే 38000 రూపాయల అందిస్తున్నారు అంటూ ఇటీవల ఒక ప్రచారం మొదలైంది. అయితే ఇది పూర్తిగా వాస్తవం అని కేంద్ర ప్రభుత్వ సమాచారం మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
యువతీ యువకులను తప్పుదారి పట్టించేలా ఈ థంబ్ నెయిల్ ఉందని, సదరు యూట్యూబ్ ఛానల్ వారు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ సమాచారం మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ద్వారా ఖండించింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని పేర్కొంది.
Also Read: Dhanteras 2024 : 100 రూపాయలు ఉంటే చాలు..ధనత్రయోదశి రోజు బంగారం కొనే ఛాన్స్..ఎక్కడ..ఎలాగో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్కీం ప్రారంభించినా వాటి అమలును అన్ని వార్తాపత్రికల్లోనూ, అన్ని టీవీ ఛానళ్లు, ఇతర సమాచారం మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుందని, వీటికి సంబంధించిన ప్రచారం బాధ్యత మొత్తం కేంద్ర ప్రభుత్వ ప్రసార మంత్రిత్వ శాఖ అది అని పేర్కొన్నారు. అయితే పైన పేర్కొన్న ఫేక్ న్యూస్ లో ఉన్న పథకం కేంద్ర ప్రభుత్వంది కాదని ఈ సందర్భంగా ఖండించింది.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఇలాంటి ఫేక్ మెసేజెస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ మెసేజెస్ పూర్తిగా అవాస్తవమని ఇలాంటి సందేశాలను వైరల్ చేసిన వారికి కఠిన శిక్షలు పడతాయని చట్టపరంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి ప్రజలకు సమాచారం కావాలంటే, తమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సంప్రదించాలని, జిల్లా కేంద్ర కార్యాలయం ద్వారా మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతోనే ఇది సాధ్యమవుతుందని, ఈ సందర్భంగా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
📢फर्जी योजनाओं से रहें सावधान❗️
दावा: केंद्र सरकार "एक परिवार एक नौकरी योजना" के तहत प्रत्येक परिवार के एक सदस्य को नौकरी देगी#PIBFactCheck
✅केंद्र सरकार द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है।
✅#Youtube चैनल "GOVT DUNIYA (LOANYOJNA)" के वीडियो थंबनेल का यह दावा #फर्जी है। pic.twitter.com/uku07hgmIY
— PIB Fact Check (@PIBFactCheck) October 19, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.