Sharada Peetham Land Allotment: పరిపాలన నిర్ణయాలతో రాజకీయంగా సంచలనం రేపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగకు ప్రజలకు కానుక అందిస్తూనే దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన శారదపీఠానికి భారీ షాక్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ కేటాయించిన అత్యంత విలువైన 15 ఎకరాల భూములను ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తూ సంచలనం రేపింది. అంతేకాకుండా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Also Read: Ys Jagan Mohan Reddy: బాధ పడకండి.. అందరిని ఏరి ఏరి జైల్లో పెడతాం.. మాజీ సీఎం జగన్ సంచలనం
మంగళగిరిలోని సచివాలయంలో బుధవారం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం విశేషం. నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లో తిరిగి బ్యాంక్ ఖాతాలో నగదు జమయ్యేలా చూడాలని మండలి నిర్ణయించింది. ఒకేసారి మూడు తీసుకోకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,700 కోట్ల భారం పడనుంది.
Also Read: Big Shock to Ys Jagan: వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చిన కీలక నేతలు, పార్టీకు రాజీనామా, ఘాటు విమర్శలు
ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీనరేజ్ ఛార్జీల రద్దుతో ప్రభుత్వానికి రూ.264 కోట్ల భారం పడుతుందని సమావేశంలో చర్చ జరిగింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ఉచిత ఇసుక సక్రమంగా అమలయ్యేలా చూడాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని సీఎం తెలిపారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడం విశేషం.
శారదాపీఠానికి షాక్
పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం విశాఖపట్టణంలో అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భీమిలికి ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో సముద్ర తీరానికి దగ్గర్లో రూ.కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున అడ్డగోలుగా ఇచ్చేశారని మంత్రివర్గంలో చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో స్వరూపానంద ఆశ్రమం పేరుతో 13 వేల స్కవర్ ఫీట్స్ అక్రమ నిర్మాణాలపై కూడా చర్చ జరిగింది. దీనిపై చర్యలు తీసుకునేలా నిర్ణయించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్ను రద్దుకు మంత్రివర్గం నిర్ణయం.
యువ మంత్రులకు క్లాస్
కాగా మంత్రివర్గ సమావేశంలో కొందరు మంత్రులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులైన మంత్రులు తమ పని తీరు మార్చుకోవాలని హితవు పలికారు. యువ మంత్రులు ఎక్కడి వారు అక్కడికి పరిమితమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు నిర్లక్ష్యం వీడాలని మంత్రులకు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.