Helicopter fly in Tirumala temple video viral: తిరుమలలో శ్రీవారి ఆలయం ఇటీవల వరుస వివాదాలకు కేరాఫ్ గా మారింది. కొన్నినెలల క్రితం లడ్డు వివాదం ఏపీ లో మాత్రమే కాకుండా.. జాతీయ స్థాయిలో కూడా వార్తలలో నిలిచింది.ఏకంగా లడ్డు వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. అంతే కాకుండా.. అప్పట్లో తిరుమల అన్నదానం సత్రంలో జెర్రీ వచ్చిందని కూడా ఒక భక్తుడు తన బాధను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. మరోవైపు టీటీడీ మాత్రం అన్నంలో జెర్రీ ఘటనను ఖండించింది.
తిరుమలలో హెలికాప్టర్ కలకలం...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పరిసరాల్లో సోమవారం హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.
ఉదయం 10:35గంటల సమయంలో ఆలయంపై హెలికాప్టర్ తిరుగుతూ కెమెరాలకు చిక్కింది.
శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని TTD… pic.twitter.com/iniPL5y8b9— Aadhan Telugu (@AadhanTelugu) October 21, 2024
మరోవైపు దివ్వెల మాధురీ, దువ్వాడ శ్రీనివాస్ లు తిరుమలలో రీల్స్ చేయడం కూడా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాంతో ఉన్నట్లు తెలుస్తొంది. తిరుమల ప్రతిష్టను తక్కువ చేసే విధంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొవాలిన కూడా స్వామి వారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో మరోమారు తిరుమల ఆలయం వార్తలలో నిలిచింది. తాజాగా, (సోమవారం) తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం మీద హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
తిరుమలలో తాజాగా, హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం మాత్రం తెగ రచ్చగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరుమల శ్రీవారి ఆలయం మెయిన్ టెంపుల్ మీద కాసేపు హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులు టీటీడికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. దీనిపై రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ దీనిపై విచారణ ప్రారంభించింది. తిరుమల నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆలయం పరిసరాల మీదుగా హెలికాప్టర్ ఎగరడంతో ఈ చర్చ మరోసారి వార్తలలో నిలిచింది. తరచూ ఇలాంటి ఘటనలు జరగడం పట్ల శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం రచ్చగా మారింది. కొందరు భక్తులు గమనించి తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. ఆలయం మీదుగా వెళ్లిన ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని గతంలోనే.. పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ స్పష్టంగా కోరింది. కానీ దీనిపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకొలేదని తెలుస్తొంది.
గత రెండు, మూడేళ్లుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగిరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో అలాంటి ఘటనలు జరిగిన సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈసారి ఘాటుగా స్పందించినట్లు తెలుస్తొంది.
Read more: Tirumala news: తిరుమల వెంకటేశ్వర స్వామికే శఠగోపం.. వైసీపీ ఎమ్మెల్సీపై కేసు.. ఆయన ఏంచేశారో తెలుసా..?
కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇలా విమానాలు, హెలికాప్టర్లు ఆలయం మీదుగా చక్కర్లు కొట్టడంపై భక్తులు మాత్రం స్వామివారికి అపచారం చేయడమంటూ కూడా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.