Gangamma Jathara in Pushpa 2: తిరుపతిలో ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే గంగమ్మ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ జాతర చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వస్తువు ఉంటారు. అందుకని ఈ జాతరను మన రాష్ట్ర జాతరగా కూడా ఈ మధ్యనే ప్రకటించారు. తిరుపతిలో జరిగే ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతర పొలిమేరలోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దల చాటింపుతో ప్రారంభమవుతుంది. ఈ జాతరలో భాగంగా మొదటిరోజు ఉదయం అమ్మవారి విశ్వరూప స్థూపానికి పసుపు, కొబ్బరి నీళ్లు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు, వడిబాలు కడతారు. అనంతరం రాత్రి 7 గంటలకు గంగమ్మ తల్లి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సారె గ్రామ పెద్దలు తీసుకొస్తారు.
ఇదేవిధంగా ఈ సంవత్సరం మే 14న అంగరంగ వైభవంగా మొదలైన ఈ జాతర మే 21 అర్థరాత్రికి ఘనంగా ముగిసింది. ఈరోజు 22వ తేద తెల్లవారుజాము అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర కార్యక్రమంతో ముగిసింది.
అక్కడివారు ఈ గంగమ్మ జాతర ప్రత్యేకత గురించి రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఈ జాతర గురించి అక్కడి 35వ వార్డు కన్వీనర్ అయిన కన్నయ్య నాయుడు మాట్లాడుతూ..” తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను.. సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలిగా భావించి ఆరాధిస్తారు” అని చెప్పుకొచ్చారు.
కాగా ఈ వారం రోజులు తిరుపతి ప్రజలు వివిధ వేషాలతో గంగమ్మ కోసం సందడి చేశారు. ముఖ్యంగా నిన్న చివరి రోజున ఎంతోమంది పుష్పా సినిమాలో చూపించినట్టు అబ్బాయిలు అమ్మాయిల వేషంతో కనిపించారు. చిన్నపిల్లలు సైతం ఖైదీ, వేషాలు భైరవ వేషాలు వేసి ఎంతో ముచ్చటగా కనిపించారు. ప్రస్తుతం ఈ జాతరకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: New Liquor Brands: ఏపీ మద్యం బ్రాండ్లు తెలంగాణలో వస్తున్నాయా.. మంత్రి క్లారిటీ ఇదే!
Also Read: U Tax Scam: ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలనం.. రేవంత్ ప్రభుత్వంపై 'యూ ట్యాక్స్' బాంబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter