Jaggery Dry Fruit Laddu: పిల్లలు తరచుగా సాయంత్రం పూట లడ్డూలు కావాలని అడుగుతూ ఉంటారు.. అయితే చాలామంది శనగపిండి బూందీ తో తయారు చేసిన లడ్డూలని ఇస్తూ ఉంటారు. నిజానికి వీటిని పిల్లలకు తినిపించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో అధిక మోతాదులో లభించే చక్కర పిల్లల పళ్ళ నుంచి అనేక రకాల అవయవాలను పాడు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి బదులుగా ప్రతిరోజు బెల్లంతో తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డును ఇవ్వడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు పిల్లల శరీరానికి అనేక రకాలుగా సహాయపడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా డ్రై ఫ్రూట్స్ పిల్లల శరీరాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి పిల్లలకు ప్రతిరోజు సాయంత్రం పూట స్నాక్స్‌లో భాగంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవ్వడం చాలా మంచిది. అయితే ఈ లడ్డును ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ కావలసిన పదార్థాలు:
✤`1 కప్పు బియ్యం పిండి
✤`1/2 కప్పు బెల్లం తురుము
✤`1/4 కప్పు శనగపిండి
✤`1/4 కప్పు నెయ్యి
✤`1/4 కప్పు డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, పిస్తా, వేరుశెనగలు)
✤`1/4 టీస్పూన్ యాలకుల పొడి
✤`నెయ్యి లేదా నూనె, వేయించడానికి
తయారీ విధానం:
✤ ఈ లడ్డుని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోవాలి అందులో బియ్యం పిండి బెల్లం తురుము శెనగపిండి యాలకుల పొడి వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.
✤`అలాగే ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
✤ ఆ తర్వాత ఈ పిండిని కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ వేళ్ళతో బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
✤ ఇలా పిండిని నెయ్యి వేసుకుంxటూ బాగా కలుపుతూ చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక ఫ్యాన్లో నెయ్యి వేసుకొని ఈ ఉండలను బంగారు రంగు వచ్చేంతవరకు అటు ఇటు వేపుకోవాలి.
✤`వేయించుకున్న ఉండాలని పక్కన చిన్న బౌల్లోకి తీసుకొని వేడి వేడిగా తింటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం.
చిట్కాలు:
✤ ఈ లడ్డూలను తయారు చేసుకునే క్రమంలో బియ్యపు పిండికి బదులుగా గోధుమ పిండిని వినియోగించడం చాలా మంచిది.
✤ అలాగే డ్రై ఫ్రూట్స్ సి పట్టుకునే క్రమంలో ఖర్జూర మొక్కలను వేసి కూడా మిక్సీ కొట్టుకోవచ్చు.
✤ లడ్డు మరింత రుచిగా ఉండడానికి ఎక్కువగా ఏలకుల పడిన వినియోగించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి