బిగ్ బాస్ హౌస్‌లో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బందీలు

జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ‘RRR’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Last Updated : Nov 16, 2018, 05:47 PM IST
బిగ్ బాస్ హౌస్‌లో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బందీలు

జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ‘RRR’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19వ తేది నుండి ప్రారంభం అవుతున్న క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమా కథలో భాగంగా రాజమౌళి ఓ బిగ్‌బాస్ హౌస్‌ను నిర్మించినట్టు టాక్.

ఆ  బిగ్‌బాస్ హౌస్‌‌లోనే షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండీ రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు నివసిస్తారని వార్తలు వస్తున్నాయి. డీవీవీ దానయ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 2020 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. ‘RRR’ సినిమాకి సంబంధించిన ప్రధాన షెడ్యూల్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగబోతుందని తెలుస్తోంది.

బాహుబలి చిత్రం సూపర్ హిట్ అయ్యాక.. ఎస్ ఎస్ రాజమౌళి తీసే ‘RRR’ పై ఇప్పటికే మెగా అభిమానులతో పాటు నందమూరి అభిమానులకు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. హిందీలో కూడా ఈ చిత్ర డబ్బింగ్ రైట్స్ తీసుకోవడానికి కరణ్ జోహార్ రెడీగా ఉన్నారని వినికిడి. ఇప్పటికే రామ్ చరణ్ "రంగస్థలం" ఇచ్చిన సక్సెస్‌తో, ఎన్టీఆర్ "అరవింద సమేత" సక్సెస్‌తో దూసుకుపోతున్నారు. వీరి ఇద్దరి కలయికలో వస్తున్న ‘RRR’ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలుసుకోవాలంటే 2020 వరకు వేచి చూడాల్సిందే.

Trending News