Man Wakes Up While Arranging Funeral: కర్ణాటకలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. వ్యక్తి చనిపోయాడని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. ఒక్కసారిగా లేచి చూర్చొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. గదగ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా.. హీరేకొప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము అటు ఇటు తిరుగుతుండగా స్థానికులు భయపడిపోయారు. మద్యం మత్తులో ఉన్న సిద్ధయ్య అనే వ్యక్తి ఆ పామును చేతితో పట్టుకున్నాడు. పామును పట్టుకుని అలానే గ్రామస్తులతో మాట్లాడాడు. తన చేతిలో గరుడ రేఖ ఉందని.. ఈ పాము తనను కాటు వేయలేదని చెప్పాడు. పామును ఊరికి దూరంగా వదిలేస్తానని గట్టిగా పట్టుకున్నాడు.
“ఓ.. ఇది పామునా..? ఇలాంటి పామును నేను ఎన్నిసార్లు చూశాను..? నా చిటికెన వేలితో పట్టుకుంటా. ఎందుకో మీకు తెలుసా..? నా చేతిలో గరుడ రేఖ ఉంది. ఏ పాము నన్ను ఏమీ చేయదు. గరుడ రేఖను చూస్తే ఎంతటి పాము అయినా సైలెంట్ అవ్వాల్సిందే. ఈ పాము ఎంత..? నేను పట్టుకుంటాను’’ అంటూ రోడ్డుపై వస్తున్న పామును అమాంతం పట్టేశాడు.
ఈ క్రమంలో ఆ పాము అతని చేతుల్లో నుంచి జారిపోయింది. భయపడిన పాము కూడా పారిపోయేందుకు ప్రయత్నిచింది. అయినా సిద్ధప్ప వదలకుండా ఆ పామును పట్టకున్నాడు. ప్రజలంతా ‘వద్దు.. వద్దు’ అని అరిచినా.. ఏం కాదు నేను చూసుకుంటా అంటూ సిద్దప్ప పామును చేతుల్లోకి తీసుకున్నాడు. ఏదో సాధించినట్లు రోడ్డుపై నిలబడి పోజులిచ్చారు. ఈ సమయంలోనే మళ్లీ పాము కాటేసింది. మొత్తం నాలుగు పాము కాటు వేసింది. అయినా పామును వదలకుండా సిద్దయ్య అలానే పట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో ఉండడంతో కొద్దిగా ముందుకు వెళ్లగానే కుప్పకూలి పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దీంతో పాము కాటు వేయడంతో సిద్దయ్య మరణించాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సిద్దయ్య ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం హుబ్బళ్లిలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయడని అనుకున్న వ్యక్తి బతకడంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: West Indies Team: పసికూనల చేతిలో పరాజయం.. వరల్డ్ కప్ రేసు నుంచి విండీస్ ఔట్
Also Read: Twitter Limit: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి