MI vs SRH: చెలరేగిన కామెరూన్ గ్రీన్‌.. సన్‌రైజర్స్‌పై ముంబై ఘన విజయం! ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

Mumbai Indians won by 8 wkts vs Sunrisers Hyderabad. ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అదరగొట్టింది.  

Written by - P Sampath Kumar | Last Updated : May 21, 2023, 08:31 PM IST
MI vs SRH: చెలరేగిన కామెరూన్ గ్రీన్‌.. సన్‌రైజర్స్‌పై ముంబై ఘన విజయం! ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

Mumbai Indians won by 8 wkts. ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అదరగొట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కామెరూన్‌ గ్రీన్ (100 నాటౌట్; 47  బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ (56; 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక  సూర్యకుమార్‌ యాదవ్ (25; 16 బంతుల్లో 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్, మయాంక్ దగార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (14) త్వరగానే అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మకు కామెరూన్‌ గ్రీన్ జతయ్యాడు. ఇద్దరు కలిసి పరుగుల వరద పారించారు. ఫోర్లు, సిక్సులతో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో ముంబై స్కోర్ పరుగులు పెట్టింది. ముఖ్యంగా గ్రీన్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే రోహిత్ హాఫ్ సెంచరీ చేయగా.. గ్రీన్ సెంచరీ చేశాడు. రోహిత్ అవుట్ అయినా సూర్యకుమార్‌ యాదవ్ అండతో గ్రీన్ చెలరేగాడు. దాంతో ముంబై మరో రెండు ఓవర్లు మిగులుండగానే ముంబై విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (83; 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), వివ్రాంత్ శర్మ (69; 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. హెన్రిచ్ క్లాసెన్ (18) పరుగులు చేయగా..  గ్లెన్‌ ఫిలిప్స్‌ (1), హరీ బ్రూక్‌ (0)లను నిరాశపరిచారు.  సన్వీర్ సింగ్ (4), ఇడెన్ మార్‌క్రమ్ (13) నాటౌట్‌గా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాశ్‌ మధ్వల్ 4 వికెట్స్ పడగొట్టాడు.

ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైతే ముంబై 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ బెంగళూరు గెలిస్తే ఫాఫ్ సేనకు కూడా 16 పాయింట్లు సాధిస్తుంది. ముంబై కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్నందున బెంగళూరు ముందంజ వేస్తుంది. 

Also Read: Lavanya Tripathi: శారీలో సొగసుల లావణ్య త్రిపాఠి మెరుపులు.. స్లీవ్ లెస్ జాకెట్‌లో అందాల విందు  

Also Read: Citroen C3X Price: భారత మార్కెట్లోకి మరో ఫ్రెంచ్ కార్.. డెడ్ చీప్ గా కారు ధర, ఇంతకీ ధర ఎంతో తెలుసా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News