Fried Rice Recipe: ఫ్రైడ్ రైస్ అంటే చిన్నా పెద్దా అనే తేడా లేదు. అందరికీ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం. త్వరగా ఏ రిసిపీ అయినా తయారు చేసుకోవాలనుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ రిసిపీ తయారు చేయండి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఫ్రైడ్ రైస్ రిసిపీ తయారు చేసుకోండి..
కావాల్సిన పదార్థాలు..
అన్నం-2 కప్పులు
క్యారట్ కట్ చేసింది- అరకప్పు
గ్రీన్ పీస్- అరకప్పు
బెల్ పెప్పర్స్- అరకప్పు
స్ప్రింగ్ ఆనియన్స్- అరకప్పు
గుడ్లు- 2
సోయాసాస్-2 tbsp
ఆయిస్టార్ సాస్-1 tbsp
నువ్వుల నూనె-1 tbsp
వెజిటేబుల్ ఆయిల్-2 tbsp
వెల్లుల్లి రెబ్బలు- 2 (సన్నగా కట్ చేసింది)
అల్లం- ఒక ఇంచు
ఉప్పు, మిరియాలు- రుచికిసరిపడా
ఇదీ చదవండి: ఖాళీ కడుపున ఈ నీటిని తాగితే చాలు.. బరువు మీకు తెలియకుండానే తగ్గిపోతారు..
ఫ్రైడ్ రైస్ రిసిపీకి కావాల్సిన పదార్థాలు..
ముందుగా కూరగాయాలు, ఉల్లికాడలు అన్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి. గుడ్లు కూడా ఒక గిన్నెల్ బీట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో వెజిటేబుల్ ఆయిల్ వేసి మీడియం మంటపై వేడి చేసుకోవాలి. ఆ తర్వాత బీట్ చేసిన గుడ్లు వేసుకుని బాగా స్క్రాంబుల్ చేసి వండుకోవాలి. దీన్ని ఓ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో మిగతా నూనె వేసుకోవాలి కట్ చేిన వెల్లుల్లి, అల్లం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే క్యారట్లు, గ్రీన్‌పీ, బెల్ పెప్పర్స్ వేసి మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అన్నం కూడా వేసి కాసేపు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత గుడ్డు కూడా వేసి ఉడికించుకోవాలి. దీనిపై సోయా సాస్, ఆయిస్టార్ సాస్, నువ్వుల నూనె, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. చివరగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది.
ఇదీ చదవండి: ప్రతిరోజూ ఒక ఖర్జూరం తింటే జరిగే మిరాకిల్స్ మీరు ఊహించలేరు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి