Health Benefits: నిమ్మరసాన్ని ఇందులోకి తాగితే.. 80 ఏళ్ల వరకు దీర్ఘకాలిక వ్యాధులు రావు!

Health Benefits: పచ్చి పసుపు రసంలో నిమ్మరసం కలిపి తాగితే బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియత్రించేందుకు కూడా సహాయపడతాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 20, 2025, 02:21 PM IST
Health Benefits: నిమ్మరసాన్ని ఇందులోకి తాగితే.. 80 ఏళ్ల వరకు దీర్ఘకాలిక వ్యాధులు రావు!

Health Benefits In Telugu: పచ్చి పసుపులో కర్కుమిన్ సమ్మేళనం అధిక పరిమాణంలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వివిధ రకాల పోషకాలతో పాటు అనేక రకాల ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్టి రోజు పచ్చిపసుపు, నిమ్మ రసం తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు అనేక రకాల పోషకాలు అందుతాయి. అయితే ఇదే రసంలో నిమ్మరసం కలుపుకుని తాగితే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి రోజు ఈ రసం తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయోజనాలు:
జీర్ణక్రియ సమస్యలు: 

పసుపును జ్యూస్‌లా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశనం కలిగిస్తాయి. ఈ రసం తాగడం వల్ల గ్యాస్ట్రిక్‌, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. ఈ పచ్చి పసుపు రసంలోనే నిమ్మరం అదనంగా కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాకుండా ఆహారాల్లోని శక్తిని విచ్ఛిన్నం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 

బరువు తగ్గడానికి..: 
పచ్చి పసుపు రసంలో కొవ్వును కరిగించే అనేక రకాల ఆయుర్వే గుణాలు లభిస్తాయి. కాబట్టి ఇందులోనే నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల దీర్ఘకాలిక శరీర బరువు సమస్యకు కూడా చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎంతో స్పీడ్‌గా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఖాళీ కడుపుతో తప్పకుండా ఈ పచ్చి పసుపు నిమ్మరసం తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది. 

రోగనిరోధక శక్తి: 
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఎక్కువ మోతాదులో లభిస్తుంది.  అలాగే ఇందులో ఎంతో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా లభిస్తాయి. కాబట్టి రోజు ఈ పచ్చిపసుపు రసం తాగడం వల్ల అన్ని రకాల ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

చర్మ సమస్యలకు చెక్‌:
పచ్చి పసుపు రసంలో నిమ్మరసం కలుపుకుని తాగితే చర్మానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మొటిమల సమస్యలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ రసం తాగితే చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా తయారవుతుంది.

గుండె ఆరోగ్యానికి..:
పసుపు రసంలో నిమ్మరసం కలుపుకుని తాగితే రక్తపోటు కూడా తగ్గుతుంది, అంతేకాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా బీపీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసం తాగడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రసం తాగితే గుండె పూర్తిగా దృఢంగా తయారవుతుంది. 

AlsoRead: Spitting Red King Cobra: కళ్లలోకి విషం చిమ్మే అరుదైన రెడ్ కింగ్ కోబ్రా.. వీడియో చూసే ధైర్యం మీకుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News