Green Tea Herbal Shampoo For Hair Care: వాతావరణం కాలుష్యం కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు సంరక్షణ కోసం మార్కెట్‌లో లభించే హెయిర్ వాష్‌లను వినియోగిస్తున్నారు. ఈ షాంపూలలో కెమికల్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పాడవుతుంది. అంతేకాకుండా కొందరిలో రాలిపోతోంది. అయితే ఇలాంటి జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి హెర్బల్ షాంపూని ఉపయోగించడం ముఖ్యమని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మీరు గ్రీన్ టీ హెర్బల్ షాంపూ వినియోగించాల్సి ఉంటుంది. ఈ టీ షాంపూని వినియోగించడం వల్ల అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ హెర్బల్ షాంపూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
షాంపూ తయారికి కావాల్సిన పదార్థాలు:
గ్రీన్ టీ ఆకులు(తేయాకులు)
మిరియాల నూనె
నిమ్మరసం
కొబ్బరి నూనె
తేనె
యాపిల్ సైడర్ వెనిగర్
గ్రీన్ టీ షాంపూను తయారు చేసుకునే విధానం:
ముందుగా గ్రీన్ టీ ఆకులను పొడి చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ టీ పొడిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. పెప్పర్‌మింట్ ఆయిల్‌ను కూడా అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో నిమ్మరసం, కొబ్బరి నూనె, తేనె కలిపి ఫైన్‌గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రీన్ టీ షాంపూ ప్రయోజనాలు:
గ్రీన్ టీ షాంపూలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ బి, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా జుట్టు అప్లై చేస్తే పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టులోని చుండ్రు సమస్యలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఈ షాంపూతో జుట్టుకు మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..
Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook