Glycerin For Hair: గ్లిజరిన్ ఇలా వాడితే జుట్టు పట్టుల పొడుగ్గా పెరుగుతూనే ఉంటుంది..

Glycerin For Hair Growth:  గ్లిజరిన్ మనకు మామూలుగా మార్కెట్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది. దీంతో గ్లిజరిన్ స్ప్రే తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి.

Written by - Renuka Godugu | Last Updated : Aug 13, 2024, 08:35 AM IST
Glycerin For Hair: గ్లిజరిన్ ఇలా వాడితే జుట్టు పట్టుల పొడుగ్గా పెరుగుతూనే ఉంటుంది..

Glycerin For Hair Growth: సాధారణంగా గ్లిజరిన్ ను మనం సౌందర్య ఉత్పత్తిలో వినియోగిస్తారు. అయితే జుట్టు స్కిన్ కేర్ లోకి గ్లిజరిన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో మాయిశ్చర్ అందుతుంది జుట్టుకు గ్లిజరిన్ అప్లై చేయడం వల్ల ఇది మంచి పోషకమే కాకుండా జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. ఫ్రీజినేస్ రాకుండా నివారిస్తుంది. దురద సమస్యను తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన కుదుళ్లకు ప్రేరేపిస్తుంది అయితే ఈ గ్లిజరిన్ ని 5 విధాలుగా ఉపయోగిస్తే జుట్టు పట్టుకుచ్చుల ఆరోగ్యంగా ,పొడుగ్గా పెరుగుతుంది. అది ఎలాగో తెలుసుకుందాం.

గ్లిజరిన్ స్ప్రే..
గ్లిజరిన్ మనకు మామూలుగా మార్కెట్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది. దీంతో గ్లిజరిన్ స్ప్రే తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి. ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేయాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని బాగా షేక్ చేసుకోవాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకొని మన జుట్టు అంతటికి కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకుంటూ ఉండాలి.

హెయిర్ మాస్క్..
జుట్టుకు గ్లిజరిన్ హెయిర్ ప్యాక్‌ తయారు చేసుకొని పెట్టుకోవడం వల్ల కూడా జుట్టు పట్టులా మెరుస్తుంది. చివర్లు పాడవ్వకుండా పెరుగుతూనే ఉంటుంది జుట్టుకు హెయిర్ మాస్కు తయారు చేసుకోవాలంటే రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ లో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలిపి మరో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి అందులోనే ఎగ్‌వైట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు అంతటికీ పట్టించి ఓ అరగంట ఇవ్వాలి ఆ తర్వాత సాధారణ గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

కలబంద కండిషనర్..
జుట్టు హెయిర్ మాస్క్ , స్ప్రే మాదిరి కండీషనర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఒక రెండు టేబుల్ స్పూన్ గ్లిజరిన్లో టేబుల్ స్పూన్ కలబంద కూడా వేసి బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు అంతటికి పట్టించి ఒక 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నాచురల్ కండిషనర్ గా పనిచేస్తుంది.

సీరమ్..
గ్లిజరిన్ తో జుట్టుకు హెయిర్ సీరమ్‌ కూడా తయారు చేసుకోవచ్చు. హెయిర్ వాష్ చేసిన తర్వాత మనం సాధారణంగా జుట్టుకు సిరం అప్లై చేస్తాము దీంతో షైనీలకు వస్తుంది ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె వేసి కలిపి దీన్ని జుట్టుకు పట్టించాలి లేకపోతే నైట్ అంతా ఇది అప్లై చేసి ఉదయం హెయిర్ వాష్ చేసినా సరిపోతుంది.

ఇదీ చదవండి: మెలనిన్ ఉత్పత్తిని పెంచి నేచురల్ గా తెల్ల వెంట్రుకలకు చెక్ పెట్టే 5 సూపర్ ఫుడ్స్..

షాంపూ..
గ్లిజరిన్ షాంపులో మిక్స్ చేసి సాధారణంగా మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. దీంతో జుట్టు నాచురల్ గా మాయిశ్చర్ అందడమే కాకుండా మృదువుగా మారుతుంది. ఇలా గ్లిజరిన్ షాంపును కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.

హెయిర్ ప్యాక్..
ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ లో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేసి ఇది జుట్టు అంతటికి అప్లై చేసి ఓ 20 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

ఇదీ చదవండి: విటమిన్ బి 12 లోపం ఉందా? ఈ పవర్ ఫుల్ డ్రింక్ దాన్ని భర్తీ చేస్తుంది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News