Pani Puri Banned In Nepal: పానీపూరీ కారణంగా అంటువ్యాధులు వచ్చే అవకాశముందనుకున్న నేపాల రాజధాని ఖాట్మండులో బ్యాన్ విధించింది. 2022 సంవత్సరంలో ఈ పానీపూరీ కారణంగా దాదాపు ముప్పే మందికి కలరా వచ్చిందని ఈ డిష్‌ను బ్యాన్ చేశారు. దీని కారణంగా పానీపూరీకు దూరమైపోయారు. లలిత్‌పుర్ లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు అధికంగా నమోదు అయ్యాయి. ఈ సమయంలోనే పానీపూరీకి ఉపయోగించే నీరు వల్ల కలరా బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట. దీంతో పానీపూరీని హైజెనిక్ గా చేసినా ఈ సమస్య తగ్గలేదు దీంతో పానీపూరీని బ్యాన్ చేశారు. వీటితో పాటు ఇతర స్ట్రీట్ ఫుడ్స్ పైన నిషేధం విధించారు. చాలా రోజుల వరకు వీధుల్లో అమ్మే ఫుడ్ ఐటమ్స్ మీద ఆంక్షలు విధించింది నేపాల్ ప్రభుత్వం. తరువాత అన్నింటి మీద ఆంక్షలు ఎత్తివేసినా పానీపూరీపై ఉన్న బ్యాన్ మాత్రం తియ్యలేదు.
అయితే అసలు కలరా అంటే?
కలరా అనేది ఒక బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది ఎక్కువగా కలుషితమైన నీళ్ళు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్యతో బాధపడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి సోకుతే గంటలపాటులో రోగి మరణించ అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను ఎలా గుర్తించాలి అంటే..
ఈ సమస్య ఉన్న వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఎప్పుడు వ్యాపించిదో తెలియదు. కానీ వీటి లక్షణాలు బట్టి మనం తెలుసుకోవచ్చు. వ్యాధితో బాధపడే వ్యక్తిలో భయం, తక్కువ రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, వాంతులు, తక్కువ బ్లడ్ షుగర్ వంటివి కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు నీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
కలరా నుంచి ఎలా రక్షించుకోవాలి:
కలరా రావడానికి ముఖ్యకారణం మన చుట్టు పక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచకపోవడం. మీరు ఎల్లప్పుడు మీ చుట్టు పక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే రోడ్డు మీద ఉండే నీటి గుంతలను మూసివేయాలి. దీని వల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉండదు. బయట వండిన ఆహార పదార్థాలను తినడకుండా ఉండాలి. అలాగే ఇంట్లో ఫిల్టర్ చేసిన నీరును తీసుకోవడం చాలా మంచిది. కలరా వ్యాధి ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం లేకపోతే ఇతరులకు కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
Also Read Ramaphalam: రామఫలం తిని తినండి.. శరీరంలో జరిగే మ్యాజిక్ మీరే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter