Cauliflower Batani Pulao: వేడి వేడి కాలీఫ్లవర్, బఠానీ పలావ్..తయారీ పద్ధతి సులభమే!

Cauliflower Batani Pulao Recipe Telugu:  చాలామంది వీకెండ్ సమయాల్లో పలావు తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమందికి చేయడం రాక వివిధ హోటల్స్ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఇకనుంచి ఇలా చేయనక్కర్లేదు కేవలం సులభమైన పద్ధతిలో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2024, 10:28 PM IST
Cauliflower Batani Pulao: వేడి వేడి కాలీఫ్లవర్, బఠానీ పలావ్..తయారీ పద్ధతి సులభమే!

Cauliflower Batani Pulao Recipe Telugu: చాలామంది పలావుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే వీకెండ్ రోజుల్లో చికెన్ కాంబినేషన్‌లో పలావ్ అడుగుతూ ఉంటారు. అయితే ఆన్లైన్‌లో ఫుడ్ ఫుడ్ అమ్మకాలు జోరుగా పెరగడంతో చాలామంది ఇంట్లో తయారుచేసిన పలావు కంటే, బయట హోటల్స్‌లో లభించే వాటిని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. కొంతమంది అయితే చెయ్యడం చాలా కష్టం అనుకొని బయట హోటల్స్ నుంచి ఆర్డర్ చేస్తారు. అయితే ఇక నుంచి ఇలా చేయనక్కర్లేదు..మేము అందించే సులభమైన పద్ధతిలో కాలీఫ్లవర్ బఠాని పలావ్ చేసుకుంటే కంచంలో ఒక్క మెతుకు వదలకుండా తింటారు. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కాలీఫ్లవర్ బఠాని పలావ్ కావాల్సి పదార్థాలు:
రెండు కాలీఫ్లవర్లు
రెండు కప్పుల బాస్మతి బియ్యం
ఒకటిన్నర కప్పు కమ్మని చిక్కటి పెరుగు
తగినంత నూనె
రెండు నుంచి మూడు బగారా ఆకులు
మూడు అంగుళాల దాల్చిన చెక్క
నాలుగు లవంగాలు
తగినంత ఉప్పు
ఇంట్లోనే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్
ఒకటిన్నర కప్పు పచ్చి బఠానీలు
మూడు నుంచి నాలుగు కట్ చేసుకున్న ఉల్లిపాయలు
రెండు టమాటోలు
కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీర
పది సాంబారు ఉల్లిపాయలు 
వేయించి మెత్తగా నూరుకున్న పచ్చిమిరపకాయలు

మసాలా పొడి:
* దాల్చినచెక్క, యాలక్కాయలు, సమంగా, కొంచెము నెయ్యిలో వేయించి పొడి కొట్టాలి.

తయారీ విధానం:
* బియ్యము శుభ్రముగా కడిగి 10 నిముషములు నీటిలో నానపెట్టాలి.

* తరువాత నీరుదించి వేసి, ఆ బియ్యము బాణలిలో పోసి ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి వేయించాలి. తడిపోయే వరకు వేయించాలి.

* కాలీఫ్లవర్‌ను చిన్నగుత్తులుగా తరగాలి. టమోటా ముక్కలుగా తరగాలి.

* పాత్రలోకి నీళ్ళు తీసుకుని, నీరు మరిగిన తర్వాత కాలీఫ్లవర్ గుత్తులు, బఠానీలు వేయాలి. మూతపెట్టి స్టవ్‌పై పది నిముషాల పాటు అలాగే వుంచి మిగిలిన నీరు వంచేయాలి.

* ప్రెషర్‌ కుక్కర్‌లో కొంచెంగా నూనె వేసి కాగిన తర్వాత గరం మసాలా సామానులు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కలియ పెట్టాలి. 

* కొంచెము సేపు ఆగిన తర్వాత టమోటా ముక్కలు వేసి ముద్దగా అయ్యే వరకూ కలియపెట్టాలి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

* దాంట్లో నూరిన గరంమసాలా, చిలికిన గడ్డపెరుగు, రెండు కప్పులు నీరు పోయాలి.

* పోసిన నీరు తెర్లడం మొదలు పెట్టిన తరువాత ఉప్పు, కాలీఫ్లవరుత్తులు, బఠాణీగింజలు, బియ్యం వేయాలి.

* సెగను తగ్గించి పది నిముషాల పాటు మూతపెట్టి  ఉడికించాలి. ఉడికిన తర్వాత గరం మసాలాపొడి, కొత్తిమీర, నూరిన ముద్ద వేసి, రెండు స్పూన్స్ నెయ్యి వేసి మెల్లగా కలపాలి.

* వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News