Dark Chocolate Benefits: మనలో చాలామంది చాక్లెట్స్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు.. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఇష్టంగానే తింటూ ఉంటారు. కానీ చాక్లెట్లు ఎక్కువగా తింటే పళ్ళు పుచ్చిపోతాయని , అందులో ఉండే షుగర్ కారణంగా దంతాల చిగుళ్ళు బలహీనపడతాయని పెద్దలు తిడుతూ ఉంటారు.. అయితే చాక్లెట్లు తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పళ్ళు పుచ్చిపోవడం, దంతాలు విరిగిపోవడం లాంటి సమస్యలు ఉండవు. కానీ ఈ చాక్లెట్ల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే వీటిని తినడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలలో కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్లు వంటివి ఆరోగ్యానికే కాకుండా అందం పెంచడానికి కూడా చాలా ఉపయోగపడతాయట. ఈ చాక్లెట్లలో ఎక్కువగా ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరంలో ఉండే మెదడు పని తీరు పైన జ్ఞాపకశక్తి పైన చాలా ప్రభావాన్ని చూపించేలా చేస్తాయట.
గుండెకు ఎంతో మేలు..
డార్క్ చాక్లెట్లు తినడం వల్ల.. అందులో ఉండే మెగ్నీషియం వల్ల రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వీటిని అప్పుడప్పుడు తింటూ ఉండడం వల్ల ఎంత ఒత్తిడినైనా సరే తగ్గించేలా చేస్తుందట.
బరువుకి చెక్..
శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధ కొవ్వులను సైతం తగ్గించడానికి డార్క్ చాక్లెట్లు చాలా ఉపయోగపడతాయి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడతాయట.
డయాబెటిక్ దూరం..
షుగర్ పేషెంట్లు కూడా వీటిని తినడం వల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను మెరుగుపరిచేలా చేస్తుంది. వీటిని తినడం వల్ల ఆకలి కూడా ఎక్కువగా వేయదు.. ఈ డార్క్ చాక్లెట్ మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది.
క్యాన్సర్ కి సైతం ఔషధం..
ముఖ్యంగా డార్క్ చాక్లెట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని సైతం తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయట.
నొప్పులు పరారు..
ఎవరైనా అధిక నొప్పులతో ఇబ్బంది పడేవారు వీటిని అప్పుడప్పుడు తినడం వల్ల వాటి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.. ఎందుకంటే ఇందులో ఉండే మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర నొప్పులు తగ్గించడానికి సహాయపడతాయి.
అందం డబుల్..
ఇక ముఖంపై వచ్చే మొటిమలు , ముడతలు వంటి సమస్యలను కూడా ఈ డార్క్ చాక్లెట్లు పరిష్కరిస్తాయని వైద్యులు చెబుతున్నారు. యువత వీటిని ఎక్కువగా తినడం వల్ల చిన్న వయసులోనే వచ్చే మచ్చలు, ముడతలను నివారించుకోవచ్చు అని వైద్య నిపుణులే చెప్పడం విశేషం..
Also Read: Necklace At Garbage: చెత్తకుప్పలో వజ్రల హారం.. గంటల్లో కార్మికులు ఏం చేశారో తెలుసా?
Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్ ఎదుట రైతుల ధర్నా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి