Economic Survey: వారానికి 55 నుంచి 60 పని గంటలు దాటితే మీ పని మటాష్.. ఫ్రూఫ్ ఇదిగో

 Economic Survey: ఉద్యోగుల పనిగంటల పెంపు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే కీలక వివరాలను వెల్లడించింది. వారానికి 60 అంతకంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.   

Written by - Bhoomi | Last Updated : Jan 31, 2025, 07:07 PM IST
Economic Survey: వారానికి 55 నుంచి 60 పని గంటలు దాటితే మీ పని మటాష్.. ఫ్రూఫ్ ఇదిగో

Economic Survey: ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆర్థిక సర్వే నివేదికను సమర్పించారు. దేశంలోని అన్ని ప్రధాన సమస్యలు ఆర్థిక సర్వే 2024-25లో ప్రస్తావించారు. సర్వేలో పనిచేస్తున్న ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి సంబంధించి కూడా ఒక నివేదికను సిద్ధం చేశారు. సర్వే ప్రకారం, 7 రోజుల్లో 55-60 గంటల కంటే ఎక్కువ పని చేయడం మానసిక ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. అదనంగా, మంచి మేనేజర్లు,  సహోద్యోగులతో పనిచేసే ఉద్యోగులు పేద మేనేజర్లు/సహోద్యోగులతో పనిచేసే ఉద్యోగుల కంటే 100-పాయింట్ ఎక్కువ (33 శాతం) మానసిక క్షేమ స్కోర్‌లను నివేదించారు.

సాధారణంగా ఉత్పాదకతకు పని గంటలనే కొలమానంగా పరిగణిస్తుంటారు. అంటే ఎంత ఎక్కువ సమయం పనిచేస్తే ఫలితం అంత ఎక్కువగా వస్తుందని భావిస్తుంటారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐఎల్ఓ సంస్థల అధ్యయనాల ప్రకారం..వారానికి 55 నుంచి 60 పని గంటలు దాటితే సదరు ఉద్యోగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానసికంగా కుంగిపోయే అవకాశముందని తెలిపింది. ఇదే విషయాన్ని 2024-25 ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసింది. ఈ సందర్బంగా మానవుడి మెదడు, మనసుపై సపియన్ ల్యాబ్స్ సంస్థ చేసిన పరిశోధనను ఆర్థిక సర్వే ఉటంకించింది.

Also Read: Pm Modi On Budget 2025:  మోదీ మాటల అర్థం అదేనా? మధ్య తరగతి ప్రజలకు బడ్జెట్‌లో అదిరే గిఫ్ట్!

ఎవరైతే కార్యాలయాల్లో రోజుకు 12గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పనిచేస్తారో వారి మానసిక స్థితి, సాధారణ సమయం పనిచేసేవారి కన్నా 100 పాయింట్లు తక్కువగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఆఫీసు వాతావరణం, సహోద్యోగులతో సత్సంబంధాలు కూడా ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయని ఆర్థిక సర్వే పేర్కొంది. నెలకు కనీసం రెండు , మూడు రోజులు కుటుంబ సభ్యులు, బంధువులతో గడపడం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి, మానసిక సమస్యలు తొలగి, మెరుగైన జీవనశైలి సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. డబ్య్లూహెచ్ఓ వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై ఒత్తిడి, ఆందోళన కారణంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 

ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్, ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పనిగంటలపై చర్చ మొదలైంది. పలువురు ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, సినీనటులు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అక్కడికి కొన్ని రోజుల తర్వాత ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా  పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అభివ్రుద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70గంటల చొప్పున పనిచేయాలని వ్యాఖ్యానించారు. తాజాగా ఆర్థిక సర్వే వారి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. 

Also Read: Gold Rates Rise: బంగారం కొనేవారికి నిర్మలమ్మ షాకింగ్ న్యూస్.. బడ్జెట్ వేళ కేంద్రం కీలక నిర్ణయం?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News