న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికే తమ ప్రాధాన్యమని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. జల్ జీవన్ మిషన్‌కు కేంద్ర బడ్జెట్లో రూ.3.6లక్షల కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు గతంలో ఉన్న నీటివనరులను పునరుద్ధరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల తన ప్రసంగంలో పేర్కొన్నారు. విద్య, వ్యవసాయ రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫొకస్ ఉందని చెప్పారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి 2.83 లక్షల కోట్లు ఖర్చుచేయనున్నట్లు ఆమె ప్రతిపాదించారు. వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి తమ తొలి ప్రాధాన్యమన్న ఆర్థిక మంత్రి, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరుకు రెండో ప్రాధాన్యమని, విద్యకు మూడో ప్రాధాన్య మని స్పష్టం చేశారు. 6.11కోట్ల మంది రైతులు ఫసల్ భీమా యోజనకు రైతులు బీమా చేయించుకుని, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి కల్పించి, వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొస్తాం. రైతులకు గిడ్డంగులు నిర్మించి సరుకును కాపాడే ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి 16 సూత్రాల పథకం అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
పీఎం కుసుమ్ పథకం అమలుతో డీజిల్, కిరోసిన్ వినియోగాన్ని తగ్గించి సోలార్ ఎనర్జీని వాడుకునేలా చేశాం. 20లక్షల మంది రైతులు సోలార్ పంపులు ఏర్పాటు చేసుకునేలా చేస్తామన్నారు. భారత్ షాలిమార్ గార్డెన్ లాంటిది. దాల్ సరస్సుమీద తామరపువ్వులా, యువరక్తంతో కూడిన దేశం ప్రపంచంలోనే ఉత్తమ దేశమని పేర్కొన్నారు. దేశంలో 271 మిలియన్ల మందిని పేదరికం నుండి బయట పడేసిన ఘనత తమ సర్కాదేనని చెప్పారు.
దేశంలోని 100 వర్షాభావ జిల్లాలకు నిధులు కేటాయింపులు
రైతుల కోసం కిసాన్ రైలును ప్రారంభిస్తాం. తద్వారా రైతులు తమ దిగుబడిని దేశవ్యాప్తంగా రవాణా చేసుకునే అవకాశం కల్పించడం.
సాగుకు అనువులేని భూముల్లో సోలాల్ సిస్టమ్ ఏర్పాటు చేసి రైతులకు ఆదాయం వచ్చేలా చేయడం
వ్యవసాయరంగ అభివృద్ధికి 16 సూత్రాల పథకం అమలు చేయడం. ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకెళ్తోంది.
కేంద్రంపై రుణభారం 48.7 శాతం మేరకు తగ్గించాం.
రైతులకు టెక్నాలజీ సాయం చేసి పంటల దిగుబడి పెంచడం
ఏ సమయంలో ఏ పంటలు పండించాలో వివరించి అవగాహన పెంచడంతో వాటికి గిట్టుబాటు ధరలు వచ్చేలా తోడ్పాడు
మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మీ పథకం అమలు చేయడం. మహిళల సాధికారికతకు మోదీ సర్కార్ చర్యలు
నాబార్డు స్కీమ్ రైతులకు వర్తింపంచేయడం. రైతుల కోసం కృషి ఉడాన్ పథకం తీసుకురావడం. కిసాన్ క్రెడిట్ పేరుతో మరిన్ని రుణాలు అందజేసేలా చూస్తామన్నారు.