Income Tax vs Salary Hike: కొత్త ఇన్‌కంటాక్స్ ప్రభావం, పెరగనున్న ఉద్యోగుల జీతాలు

Income Tax vs Salary Hike: ఉద్యోగులకు శుభవార్త. నిర్మలమ్మ పద్దు ప్రభావంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ట్యాక్స్ ప్రయోజనాలతో పాటు జీతాలు కూడా పెరగనున్నాయి. సగటు ఉద్యోగి జీతంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, జీతం ఎంత, ఎంత ఆదా అవుతుందనే లెక్కలు సులభంగా తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 2, 2025, 11:15 AM IST
Income Tax vs Salary Hike: కొత్త ఇన్‌కంటాక్స్ ప్రభావం, పెరగనున్న ఉద్యోగుల జీతాలు

Income Tax vs Salary Hike: కేంద్ర బడ్జెట్ 2025లో ఇన్‌కంటాక్స్ విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్య తరగతి ప్రజలకు భారీగా ట్యాక్స్ మినహాయింపు లభిస్తోంది. 12 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఫలితంగా పరోక్షంగా ఉద్యోగుల జీతాలపై ఇది ప్రభావం చూపించనుంది. అంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల జీతం భారీగానే పెరగవచ్చు. అదెలాగో ఆ లెక్కలేంటో మీకు అర్థమయ్యేలా తెలుసుకుందాం

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్యాక్స్ పేయర్లకు బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఏడాదికి 12.75 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్మలమ్మ ప్రకటించిన పన్ను విధానం కేవలం ట్యాక్స్ మినహాయింపులే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల జీతభత్యాలపై ప్రభావం చూపించనుంది. ఓ వ్యక్తి 1 లక్ష రూపాయలు జీతం తీసుకుంటుంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఏడాదికి 80 వేలు ఆదా అవుతుంది. అంటే టీడీఎస్ కట్ కాకపోవడంతో ఉద్యోగి జీతంలో నెలకు 6500 పెరగనుంది. ప్రజల చేతిలో డబ్బులు పెరిగి వినిమయం పెరిగే కొద్దీ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

ఎంత జీతం ఉంటే ఎంత ఆదా అవుతుంది

స్టాండర్డ్ డిడక్షన్ 75 వేలతో కలిపి ఏడాదికి 12.75 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ ఇకపై ఉండదు. అయితే ఆపై ఆదాయం ఉంటే కొత్త స్లాబ్ ప్రకారం ట్యాక్స్ ఉంటుంది. ఇప్పటి వరకూ ఉన్న ట్యాక్స్ స్లాబ్‌తో పోలిస్తే కొత్త స్లాబ్‌లో 12.75 లక్షలు ఆదాయం దాటినా చాలా వరకు ఆదా అవుతుంది. 

13 లక్షల జీతంపై    25 వేలు
14 లక్షల జీతంపై    30 వేలు
15 లక్షల జీతంపై    35 వేలు
16 లక్షల జీతంపై    50 వేలు
17 లక్షల జీతంపై    60 వేలు
18 లక్షల జీతంపై    70 వేలు
19 లక్షల జీతంపై    80 వేలు
20 లక్షల జీతంపై    90 వేలు
21 లక్షల జీతంపై    1 లక్ష

అంటే ఇదంతా ఆదా అయ్యే డబ్బులు. టీడీఎస్ రూపంలో కట్ కాకుండా జీతానికి యాడ్ అవుతుంది. అంటే పరోక్షంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల జీతంపై ప్రభావం చూపించనుంది. 

Also read: Jio Cheap and Best Plan: జియో నుంచి అత్యంత చౌక ప్లాన్ మళ్లీ వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News