Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాత వరుసగా అవమానాల పాలవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని కొద్ది మంది గుర్తించలేదనే సంగతి పలు సందర్భాల్లో స్పష్టమవుతూనే ఉంది. పుష్ప 2 విడుదలైన తర్వాత జరిగిన సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్.. స్టేజ్ పై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయారు. ఆ అవమానాన్ని రేవంత్ రెడ్డి.. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్బంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సినిమా వాళ్లపై రుద్ది.. అల్లు అర్జున్ ను అక్రమంగా అరెస్ట్ చేయించి తన ఈగో సాటిస్ఫై చేసుకున్నారని అప్పట్లో అందరు చెప్పుకున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు మాత్రం అల్లు అర్జున్ ను అక్రమంగా అరెస్ట్ చేయించి తన అహం చల్లార్చుకున్నాడనే మాట వివపడింది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఆ తర్వాత జరిగిన ఓ ఈవెంట్ లో చంటిగాడు ఫేమ్ బాలాదిత్య.. రేవంత్ రెడ్డి పేరు కాకుండా.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు.
దెబ్బ మీద దెబ్బ
రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం
రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన జగ్గారెడ్డి
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ తడబడిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.#CongressFailedTelangana #Congress #Jaggareddy pic.twitter.com/xt2bB36oMt
— 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗧𝗮𝗹𝗸𝘀🎙️ (@TSTalks4YOU) February 1, 2025
ఆ అవమానాన్ని మరిచిపోకముందే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి .. ముఖ్యమత్రిగా రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయి ఆయన పేరుకు బదులు కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి నాలుక కరుచుకున్నారు. ఆ తర్వాత సారీ చెప్పడం గమనార్హం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పదే పదే మరిచిపోతూ ఆయన్ని అవమానాల పాలు చేస్తున్నారనే ముచ్చట వినబడుతోంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.