Budget 2025: మధ్యతరగతి ఉద్యోగులకు భారీ శుభవార్త.. రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు

 Budget 2025: ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు.

Written by - Bhoomi | Last Updated : Feb 1, 2025, 12:26 PM IST
 Budget 2025: మధ్యతరగతి ఉద్యోగులకు భారీ శుభవార్త.. రూ. 12 లక్షల వరకు ఆదాయపు పన్ను  మినహాయింపు

 Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ ను ఆవిష్కరిస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే రైతులకు, మహిళలకు చాలా మందికి వరాల జల్లులు కురిపించారు. మధ్య తరగతి ప్రజల కోసం పన్ను చెల్లింపులపై కీలక ప్రకటన  చేశారు. కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లును తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇది చాలా సులుభంగా ఉంటుందని తెలిపారు. టీసీఎస్, టీడీళఎస్ వంటి వాటిని హేతుబద్దీకరిస్తామని తెలిపారు. పీటీఐ సంస్కరణలు ఉంటాయని చెప్పారు. సీనియర్ సిటిజన్లకు సంబంధించిన టీడీఎస్, టీసీఎస్ పరిమితిని రూ. 50వేల నుంచి లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్, రెమిటెన్స్ వంటి వాటిపై టీసీఎస్ ను రూ. 7లక్షల నుంచి రూ. 10లక్షలకు పెంచారు. విద్యారంగానికి సంబంధించి రెమిటెన్స్ పై టీసీఎస్ ఎత్తి వేయనున్నట్లు తెలిపారు. రూ. 12లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 

Also Read: Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు  

ఆదాయపు పన్ను పరిమితిని ఈ విధంగా పెంచారు 

2005: ₹1 లక్ష
2012: ₹2 లక్షలు
2014: ₹2.5 లక్షలు
2019: ₹5 లక్షలు
2023: ₹7 లక్షలు
2025: ₹12 లక్షలు

Also Read: UnionBudget 2025 Income Tax Bill: వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News