ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు అనంతరం దేశం నలుమూలలా బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ని ప్రవేశపెట్టినట్టు ప్రధాని తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లను విడిచిపెట్టడం లేదు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాకా రుణాలు తీసుకున్న వాళ్లు ఎవ్వరూ ఆ రుణాలు ఎగ్గొట్టలేదు అని ఈ సందర్భంగా మోదీ స్పష్టంచేశారు.
Delhi: Prime Minister Narendra Modi launches India Post Payments Bank (IPPB). IPPB will have 650 branches and 3250 Access Points across the country. All the 1.55 lakh Post Offices in the country will be linked to the IPPB system by December 31. pic.twitter.com/6HWvaJhMFt
— ANI (@ANI) September 1, 2018
Through India Post Payments Bank (IPPB) we will reach to every nook & corner of the country. Bank & banking services will be available at every person's doorstep: PM Narendra Modi at the launch of India Post Payments Bank (IPPB) pic.twitter.com/Ep5GJ8nRSo
— ANI (@ANI) September 1, 2018