EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటే

EPFO Breaking News: ఈపీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్ల సౌకర్యార్ధం సరికొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. ఈ ఫీచర్ ప్రకారం డబ్బులు అవసరమైతే ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2024, 10:25 AM IST
EPFO Breaking News: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా ఎప్పట్నించంటే

ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ఖాతాదారుల కోసం కొత్త ఫీచర్లు, సేవలు అందిస్తోంది. ఇందులో భాగంగానే క్లెయిమ్స్ త్వరగా సెటిల్ చేసేందుకు సులభమైన ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇకపై పీఎఫ్ క్లెయిమ్స్ ప్రక్రియ లేకుండా నేరుగా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసకునే వెసులుబాటు రానుంది. 

ఈపీఎఫ్ఓ ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తున్న ఈపీఎఫ్ఓ కార్యాలయం కొత్త టెక్నాలజీతో పనిచేస్తోంది. ప్రతి 2-3 నెలలకోసారి మార్పులు చేర్పులు గమనించవచ్చు. ముఖ్యంగా వచ్చే ఏడాది నుంచి గణనీయమైన మార్పు కన్పించనుంది. దేశవ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా ఖాతాదారుల్ని కలిగిన ఈపీఎఫ్ఓ సంస్థ ఇకపై క్లెయిమ్స్ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. దీని ప్రకారం డబ్బులు అత్యవసరమై క్లెయిమ్ చేసుకున్న ఖాతాదారులు నేరుగా ఏటీఎం నుంచి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ జనవరి 2025 నుంచి అమల్లో రానుంది. 

పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ఉద్యోగికి ఉంటుంది. ఇందులో అటు ఉద్యోగి, ఇటు యాజమాన్యం నుంచి డబ్బు జమ అవుతుంటుంది. ఉద్యోగికి ఎప్పుడైనా డబ్బులు అవసరమనుకుంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవల్సి ఉంటుంది. యూఏఎన్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్ ఇచ్చి క్లెయిమ్ చేసుకుంటే 2-3 వారాల్లో బ్యాంకులో డబ్బులు జమ అవుతాయి. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ లేకుండా నేరుగా ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించనుంది ఈపీఎఫ్ఓ కార్యాలయం.

Also read: YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News