అప్పుడప్పుడు పోలీసులకు కొన్ని వింత కేసులు ఎదురవుతుంటాయి. వాటిని చూసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఓ రైతు తన గేదె పాలివ్వడం లేదని పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. అది పాలివ్వకుండా ఎవరో దానికి చేతబడి (witchcraft) చేశారని అనుమానం వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
'బాబులాల్ జాతవ్ (45) అనే రైతు శనివారం (నవంబర్ 13) నయాగావ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. గత కొద్దిరోజులుగా తన గేదె (Buffalo) పాలివ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.' అని స్థానిక డీఎస్పీ అరవింద్ షా వెల్లడించారు. పాలిచ్చే గేదె ఒక్కసారిగా పాలివ్వడం మానేసిందంటే ఎవరో దానికి చేతబడి చేశారని గ్రామస్తులు చెప్పడంతో బాబులాల్ దాన్ని నమ్మాడు. అదే నిజమనుకుని పోలీస్ స్టేషన్‌కు (Police station) వచ్చి ఫిర్యాదు చేశాడు. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Also Read:AP CM YS Jagan convoy వెంట పరుగెత్తిన మహిళ.. కారు ఆపిన సీఎం జగన్
నాలుగు గంటలు గడిచాక బాబులాల్ మళ్లీ పోలీస్ స్టేషన్‌కు (Police station) వచ్చాడు. ఈసారి ఏకంగా గేదెను వెంటపెట్టుకొచ్చాడు. గేదె పాలిచ్చేందుకు పోలీసులను సాయం చేయమని కోరాడు. దీంతో అక్కడి పోలీసులు అతన్ని పశు వైద్యుడి (Veterinary) వద్దకు పంపించారు. ఆదివారం (నవంబర్ 14) ఉదయం బాబులాల్ మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తన గేదె పాలిస్తోందని సంతోషం వ్యక్తం చేశాడు. పోలీసులకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయాడు. బాబులాల్ గేదెతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. గతంలో ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే తన రెండు గేదెలు తప్పిపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook