భారతీయ పాపులర్ వంటకం ఒక అరుదైన రికార్డుని నెలకొల్పి గిన్నిస్ బుక్‌లో చేరింది. ఈ రోజే వరల్డ్ ఫుడ్ ఇండియా ఉత్సవాల్లో భాగంగా "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లో చోటు దక్కించుకోవడం కోసం ప్రముఖ వంటల నిపుణుడు సంజీవ్ కపూర్, యోగా నిపుణుడు రామ్‌దేవ్‌తో కలిసి 918 కేజీల కిచిడీని వండి వార్చారు.
బియ్యం, వివిధ రకాల మసాలా దినుసులు, బఠానీలు, కాయగూరలను ఈ కిచిడీ తయారు చేయడంలో ఉపయోగించారు. ఇలా తయారుచేసిన కిచిడీని అక్షయపాత్ర ఫౌండేషన్ బాలలతో పాటు మరో 60000 మంది ప్రజలకు పంచనున్నారు. ఈ కిచిడీని వండి వార్చడానికి ఒక రాత్రంతా పట్టింది.
ఒక ప్రత్యేక ఉత్సవంగా జరిపిన ఈ కిచిడీ తయారీ కార్యక్రమంలో కేంద్ర ఆహార వనరుల శాఖ మంత్రి హర్మిత్ సింగ్ బాదల్‌తో పాటు యూపీ రాష్ట్ర మంత్రి సాధ్వీ నిరంజన్ కూడా పాల్గొన్నారు.
వీరితో పాటు డెన్మార్క్ ఫుడ్ మినిస్టర్ ఎస్బెన్ లున్డే లార్సన్, ఐటీసీ హోటల్స్ సీఈఓ సంజీవ్ పూరి, టాటా కెమికల్స్ సీఓఓ రిచ్ అరోరా మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
Khichdi is Indian super food. It's healthy, complete, Satvik & nutritious. Indian masalas & Patanjali Ghee makes it delicious 👍 pic.twitter.com/x5tnRWGPJ1
— Swami Ramdev (@yogrishiramdev) November 4, 2017
We did it, we broke the record! Our #Khichdi has weighed in at an impressive 918kgs! #KhichdiForWorldRecord #FoodStreet #WorldFoodIndia pic.twitter.com/qNIgKhflGo
— World Food India (@worldfoodindia) November 4, 2017